Tattoos | లండన్, ఆగస్టు 22: అత్యధిక పచ్చ బొట్లు కలిగిన వ్యక్తిగా అమెరికా మహిళ ఎస్పరెన్స్ లుమినెస్కా ఫ్యూయెర్జినా(36) గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 99.98 శాతం శరీరాన్ని ఆమె పచ్చబొట్లతో నింపేశారు. ‘చీకటిని అందంగా మార్చడం’ అనే ఇతివృత్తంతో తన దేహాన్ని కాన్వాస్‌గా మార్చుకున్నారు.
బ్రిడ్జ్‌పోర్ట్‌కు చెందిన ఈ మాజీ ఆర్మీ ఉద్యోగిని అందమైన డిజైన్ల పచ్చబొట్లతో శరీరాన్ని నింపేశారు. గిన్నిస్ రికార్డ్ కలిగిన వారిని ప్రశంసిస్తూ పెరిగిన ఆమె తనకు రికార్డ్ దక్కడంపై కృతజ్ఞతలు తెలిపారు. మహిళల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి పచ్చబొట్ల రికార్డ్‌తో ప్రయత్నించానని చెప్పారు.