HomeLATEST NEWSWill release my financial report before 2020 elections: Trump

ఆస్తుల వివ‌రాలు ప్ర‌క‌టిస్తా: ట‌్రంప్‌

Published: Tue,September 10, 2019 08:50 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైద‌రాబాద్‌: 2020లో జ‌ర‌గ‌నున్న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముందు త‌న ఫైనాన్సియ‌ల్ రిపోర్ట్‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎన్నిక‌లకు ముందు త‌న ఆర్థిక నివేదిక‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చెప్పారు. పూర్తి స్థాయి రిపోర్ట్‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వైట్‌హౌజ్‌లో రిపోర్ట‌ర్ల‌కు తెలిపారు. త‌మ కుటుంబానికి చెందిన ప్రాప‌ర్టీల‌పై ప్ర‌భుత్వం అధిక స్థాయిలో ఖ‌ర్చులు చేస్తోంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ట్రంప్ ఈ కామెంట్ చేశారు. ఐర్లాండ్‌లో ఉన్న ట్రంప్ ప్రాప‌ర్టీలో అమెరికా ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ బ‌స చేశారు. దీంతో ట్రంప్ ఆస్తుల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 2020 న‌వంబ‌ర్‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు ముందు ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాన‌ని, ఆ విష‌యాలు మిమ్మ‌ల్ని షాక్‌కు గురి చేస్తాయ‌ని ట్రంప్ తెలిపారు. ప్ర‌తి ఏడాది ఎంత ప‌న్నుక‌డుతున్నార‌న్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ట్రంప్ ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.
803
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology