ఎదురుగా రైలు..క్షణాల్లో డ్రైవర్‌ను కాపాడాడు..వీడియో

Thu,October 17, 2019 05:37 PM


వాషింగ్టన్: కారు రైల్వే ట్రాక్ దగ్గర ఆగి ఉంది. కారులో డ్రైవర్ అపస్మాకర స్థితిలో ఉండటంతో..ఎదురుగా రైలు వస్తున్నా గుర్తించే స్థితిలో లేడు. ఉటా హైవే పెట్రోలింగ్ టీం అటుగా వెళ్తుండగా రైల్వే ట్రాక్ వద్ద ఆగి ఉన్న కారును గమనించారు. ఓ వైపు ఎదురుగా రైలు వస్తోంది. పెట్రోలింగ్ టీం లోని ట్రూపర్ రూబెన్ కొర్రియా అనే ఆఫీసర్ ఏ మాత్రం భయపడకుండా తన ప్రాణాలు లెక్కచేయకుండా కారు దగ్గరకు వెళ్లాడు.


రైలు వస్తోంది. కారులో నుంచి బయటకు రమ్మని ట్రూపర్ ఆ డ్రైవర్ ను హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ట్రూపర్ కారు డోర్ తీసి డ్రైవర్‌ను బయటకు లాగాడు. డ్రైవర్‌ను బయటకు లాగిన కొద్ది క్షణాల్లోనే రైలు కారును ఢీకొట్టింది. గంటకు 50-80 మైళ్ల వేగంతో రైలు వస్తోంది. ఆ సమయంలో కారులో ఉన్న డ్రైవర్‌ను ఎలా బయటకు తీసుకురావాలనేది మాత్రమే ఆలోచించాను. నా పని నేను చేశాను. నా గురించి ఏం ఆలోచించలేదని ట్రూపర్ రూబెన్ అన్నాడు. ధైర్యసాహసాలతో డ్రైవర్ ప్రాణాలు కాపాడిన ట్రూపర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


8101
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles