న్యూజెర్సీలో కాల్పులు : ఆరుగురు మృతి

Wed,December 11, 2019 10:52 AM

న్యూయార్క్‌ : న్యూజెర్సీలో కాల్పుల మోత మోగింది. హుడ్సన్‌ నదీ తీరంలోని ఓ దుకాణంలోని ఇద్దరు దుండగులు మంగళవారం మధ్యాహ్నం చొరబడ్డారు. ట్రక్కులో వచ్చిన ఈ అగంతకులు దుకాణంలో ఉన్న వారిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దుండగులకు, పోలీసులకు మధ్య గంటపాటు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పౌరులు, ఓ పోలీసు ఉన్నతాధికారి, ఇద్దరు దుండగులు మృతి చెందారు. ఇద్దరు పోలీసులు, మరో పౌరుడు గాయపడినట్లు పోలీసు ఉన్నతాధికారి మిచ్చెల్‌ కెల్లీ వెల్లడించారు. కాల్పుల నేపథ్యంలో జెర్సీ పట్టణంలోని అన్ని పాఠశాలలు, దుకాణ సముదాయాలను పోలీసులు మూసివేయించారు. న్యూజెర్సీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.


కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్రంప్‌ ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనను తాము పర్యవేక్షిస్తున్నామని, విచారణ జరపాలని అధికారులను ఆదేశించామని ట్రంప్‌ పేర్కొన్నారు.


1475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles