లాహోర్‌ - ఢిల్లీ బస్సు సర్వీసులు రద్దు

Sat,August 10, 2019 12:06 PM

Pakistan suspends Delhi Lahore Dosti bus service

హైదరాబాద్‌ : భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచేసుకున్న పాకిస్థాన్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వినోద రంగానికి చెందిన అన్ని రకాల సాంస్కృతిక మార్పిడిలు, కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్టు పాక్‌ నిర్ణయించింది. అంతేకాకుండా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ సేవలను నిలిపివేసిన పాకిస్థాన్‌ నిన్న థార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలపై సైతం వేటు వేసింది.

ఇవాళ తాజాగా లాహోర్‌ - ఢిల్లీ ఫ్రెండ్‌షిప్‌ బస్సు సర్వీసులను కూడా పాకిస్థాన్‌ రద్దు చేసింది. లాహోర్‌ - ఢిల్లీ బస్సు సర్వీసును తొలిసారిగా 1999, ఫిబ్రవరిలో ప్రారంభించారు. 2001లో పార్లమెంట్‌పై దాడి తర్వాత ఆ బస్సు సర్వీసులను రద్దు చేశారు. మళ్లీ 2003లో ఆ బస్సు సేవలను పునరుద్ధరించారు. తాజాగా మళ్లీ బస్సు సర్వీసులను పాక్‌ రద్దు చేసినట్లు పాకిస్థాన్‌ మంత్రి వెల్లడించారు. జాతీయ భద్రతా కమిటీ(ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో లాహోర్‌ - ఢిల్లీ బస్సు సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పాక్‌ మంత్రి మురాద్‌ సయీద్‌ ప్రకటించారు.

ఈ బస్సు ఢిల్లీ గేట్‌కు సమీపంలో అంబేడ్కర్‌ టెర్మినల్‌ తన సేవలను కొనసాగిస్తుంది. ఢిల్లీ నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో లాహోర్‌కు ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ బస్సులు వెళ్తాయి. పాకిస్థాన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ బస్సులు కూడా ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఢిల్లీ నుంచి లాహోర్‌ బయల్దేరుతాయి.

1539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles