పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధిలో మన పాత్ర పోషిద్దాం

Wed,November 27, 2019 02:16 PM

అమెరికా: ఆంధ్రప్రదేశ్‌ విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెస్తోన్న అద్భుతమైన మార్పులు విద్యార్థులకు ఎంతో మేలు చేయనున్నాయని, ఆ యజ్ఞంలో తమ వంతు పాత్రగా ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషిస్తే.. మెరుగైన ప్రణాళికలో భాగస్వామ్యులు అయినట్టవుతుందన్నారు. విద్యామూలం ఇదం జగత్‌, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న రెండు కార్యక్రమాలను తక్షణ కర్తవ్యంగా ఎంచుకున్నామని రత్నాకర్‌ తెలిపారు.



అభిమాన మిత్రుడికి ఆత్మీయ సత్కారం
అమెరికాలోని గ్రేటర్‌ క్లీవ్‌ లాండ్‌ ప్రాంతంలో తెలుగు సంస్కృతి, ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కోసం కృషి చేస్తోన్న నార్త్ ఈస్ట్ ఒహాయో తెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా పండుగాయల రత్నాకర్‌ను సత్కరించింది. ఓహియో క్లీవ్‌ లాండ్‌ సబర్బన్‌ ప్రాంతమైన మిడిల్‌ బర్గ్‌ హైట్స్‌ పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రత్నాకర్‌ సేవలను కొనియాడారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల కోసం రత్నాకర్‌ విశేష కృషి చేశారని, ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గుర్తించారని తెలిపింది. అమెరికా, కెనడా దేశాలలో ప్రవాసాంధ్రులకు ఏ ఇబ్బంది ఉన్నా.. నేనున్నానంటూ ముందుకొచ్చే రత్నాకర్‌.. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార రంగంలోకి వచ్చిన ఎంతో మందికి తనవంతు సహకారం అందించారని తెలిపింది.

భవిష్యత్తులో రత్నాకర్‌ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ప్రవాసాంధ్రులకు చేరువవుతారని నార్త్ ఈస్ట్ ఒహాయో తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీకృష్ణ ప్రసాద్‌ మువ్వ, ఉపాధ్యక్షులు శివ భీమవరపు తెలిపారు. కార్యక్రమంలో నార్త్‌ ఈస్ట్‌ తెలుగు అసొసియేషన్‌ ట్రస్టీ శ్రీ గిరిరాజు అయ్యగారి, సంస్థ ఫౌండర్‌ డా.సీతారామరెడ్డి తొండపు, డా.లక్కిరెడ్డి మురళి, డా. ఛార్లెస్‌ తోడెటి, శ్రీ రాజశేఖర్‌ కల్లం, శ్రీ హరినాథ్‌ బత్తిని, శ్రీ సూర్య బుద్ధవరపు, శ్రీ యోగశ్వరరెడ్డి, శ్రీ కిషోర్‌ కుమార్‌, శ్రీ అర్జున్‌, శ్రీ పవన్‌ కుమార్‌, శ్రీ శశిధర్‌, శ్రీ రమేష్‌ పసుమర్తి పాల్గొననున్నారు. అలాగే క్లీవ్‌ లాండ్‌లో వైఎస్సార్‌సీపీ కోసం కృషి చేస్తున్న పార్టీ సభ్యులు శ్రీ రవి పచిపాల, శ్రీ సలీం షేక్‌, శ్రీ వెంకట్‌ మట్ట, శ్రీ రామ్‌ మేడపాటి, శ్రీ రవి నూక, శ్రీ నరేష్‌ బొద్దు, శ్రీ అనిల్‌ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles