ట్రేడ్ సెంట‌ర్ల‌పై ఉగ్ర‌దాడి.. తొలి ఫోటోలు రిలీజ్‌

Wed,September 11, 2019 03:18 PM

Never before seen photos of 9/11 carnage released, pics taken by medic first on scene at Twin Towers

హైద‌రాబాద్‌: 2001, సెప్టెంబ‌ర్ 11న‌, అమెరికాలో ఉన్న వ‌ర‌ల్డ్ ట్రెడ్ సెంట‌ర్ల‌పై ఉగ్ర‌వాదులు విమానాల‌తో దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ దాడితో భారీ ట్విన్ ట‌వ‌ర్స్ ధ్వంసం అయ్యాయి. అయితే ఆ విషాద ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ రిలీజ్ చేయ‌లేదు. కానీ ఇవాళ తాజాగా ఆనాటి ఉగ్ర‌ఘాతుకానికి సాక్ష్యాలుగా మిగిలిన కొన్ని ఫోటోల‌ను రిలీజ్ చేశారు. ఆ రోజున ఉదయం 9న ఘ‌ట‌నా ప్రాంతానికి మొదట‌గా డాక్ట‌ర్ ఎమిలీ చిన్ అనే మెడిక్ చేరుకున్నారు. న్యూయార్క్‌లోని మ‌న్‌హ‌ట్ట‌న్ వ‌ద్ద ఉన్న ట‌వ‌ర్స్ విమానాల దాడిలో ధ్వంసం అవుతున్న స‌మ‌యంలో ఆ మెడిక్ అక్క‌డే ఉన్నారు. ఆ డాక్ట‌ర్ రిలీజ్ చేసిన‌వే ఈ ఫోటోలు. అమెరికాపై ఉగ్ర‌వాదులు చేసిన దాడిలో సుమారు 2900 మంది చ‌నిపోయిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ల వ‌ద్ద దాదాపు ఘ‌ట‌న జ‌రిగిన వంద రోజుల వ‌ర‌కు కూడా మంట‌లు చెల‌రేగుతూనే ఉన్నాయి. అగ్నిమాప‌క సిబ్బంది కూడా అక్క‌డ నిరంత‌రాయంగా ప‌నిచేశారు.


4599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles