భార్య నిద్ర కోసం 6 గంటలు నిలబడ్డాడు..

Tue,September 10, 2019 02:41 PM

Man Stood For 6 Hours In Flight To Let Wife Sleep

ప్రేమించే వ్యక్తిత్వం ఉండాలి కానీ అది ఏ రూపంలోనైనా వ్యక్తీకరించొచ్చు. భర్తే తన ప్రపంచం అని భావించే భార్య కోసం.. ఓ వ్యక్తి గొప్ప త్యాగం చేశాడు. ఆమె నిద్రకు భంగం కలిగించకుండా ఆరు గంటల పాటు విమానంలో నిలబడ్డాడు. తన భార్య నిద్ర పోవడమే తనకు ముఖ్యమని భావించిన భర్త.. ఆమె కోసం తన సీటును త్యాగం చేశాడు. ఆమె తన సీటుతో భర్త సీటులో ఒరిగి హాయిగా నిద్రపోయింది. భార్య నిద్ర కోసం ఆరు గంటలు నిలబడి ఉండడం వారి ప్రేమకు నిదర్శనమని చెబుతూ.. ఆ దంపతుల ఫోటోను లీ జాన్సన్‌ అనే వ్యక్తి తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశాడు. ఈ దంపతుల అన్యోన్య ప్రేమపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.3796
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles