లీటర్ పాలు 140 రూపాయలు..!

Wed,September 11, 2019 12:53 PM

litre  milk rate rs 140

కరాచి: సాధారణంగా లీటర్ పాల ధర గరిష్ఠంగా రూ. 60కి మించదు. కానీ పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, కరాచి లాంటి నగరాల్లో పాల ధర పెట్రోల్, డీజిల్ ధరలను మించిపోయింది. మంగళవారం మొహర్రం సందర్భంగా పాక్‌లో లీటర్ పాల ధర 120-140 రూపాయలు వరకు పలికింది. సాధారణంగా మొహర్రం రోజున పాల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే డిమాండ్ ఆ విధంగా ఉంటుంది. కానీ, ఈ తీరుగా పెరగడం ఇదే ప్రథమమని స్థానికులు అంటున్నారు. పవిత్ర మొహర్రం సందర్భంగా ముస్లింలు పాలతో వివిధ రకాలైన పానియాలు(షరబత్ లాంటివి), వంటకాలు తయారు చేసి ప్రజలకు పంచుతారు. దీంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

కాగా, పాక్‌లో లీటర్ పెట్రోల్ ధర 113రూపాయలు, డీజిల్ 91 రూపాయలు కానీ, పాల ధర మాత్రం వాటిని మించిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ ఆఫీస్ లీటర్ పాల ధర 94 రూపాయలుగా అధికారిక ప్రకటన చేసింది.

3425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles