ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ఐఎంఎఫ్ చీఫ్‌

Wed,October 9, 2019 12:45 PM

హైద‌రాబాద్: ప్ర‌పంచవ్యాప్తంగా ఆర్థిక మంద‌గ‌మ‌నం కొన‌సాగుతోంద‌ని అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్ డైర‌క్ట‌ర్ క్రిస్ట‌లినా జార్జీవా తెలిపారు. దీని ప్ర‌భావం భార‌త్‌పై అత్య‌ధికంగా ఉంటుంద‌ని ఆమె హెచ్చ‌రించారు. ఈ ఏడాదే ఆ ప్ర‌భావం క‌నిపిస్తుంద‌న్నారు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధి రేటు మ‌రీ అత్య‌ల్పంగా ఉంటుంద‌న్నారు. ఈ ద‌శాబ్ధ‌కాలంలోనే అది అతి త‌క్కువ‌ రేటుగా న‌మోదు అవుతుంద‌న్నారు. దాదాపు 90 శాతం ప్ర‌పంచ దేశాలు న‌త్త‌న‌డ‌కన‌ వృద్ధి రేటును కొన‌సాగిస్తాయ‌న్నారు. రెండేళ్ల క్రితం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి దిశ‌లో వెళ్లింద‌ని, దాదాపు 75 శాతం దేశాలు ఆ దిశ‌గా వెళ్లాయ‌ని, కానీ ప్ర‌స్తుతం ఆర్థిక మంద‌గ‌మ‌నం కొన‌సాగుతోంద‌న్నారు. అమెరికా, జ‌ర్మ‌నీ దేశాల్లో రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉంద‌న్నారు. భార‌త్‌, బ్రెజిల్ లాంటి ఎదుగుతున్న మార్కెట్ వ్య‌వ‌స్థ‌ల్లో ఆర్థిక వృద్ధి బ‌ల‌హీనంగా ఉంటుంద‌న్నారు. ప్ర‌పంచ ఆర్థిక వాణిజ్యం ఓ ద‌శ‌లో నిలిచిపోతుంద‌న్నారు.

5435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles