ఈ ఏడాది ‘ఫన్నీయెస్ట్ ఎనిమల్’ ఫొటో ఇదే

Thu,November 14, 2019 06:28 PM

కామెడీ విల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్-2019లో సింహం పిల్ల ఫొటో టాప్ ప్లేస్‌లో నిలిచింది. సింహాన్ని వెనక నుంచి పట్టుకునేందుకు ప్రయత్నిస్తోన్న పిల్ల సింహం ఫొటో ఫన్నీయెస్ట్ ఎనిమల్ ఫొటోగా నిలిచింది. సారా స్కిన్నర్ అనే ఫొటోగ్రాఫర్ బోట్స్‌వానాలో ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో నా హృదయాన్ని కాస్త బరువెక్కించింది. సింహం పిల్ల ఫొటో ప్రపంచానికి కొంత హాస్యాన్ని, సంతోషాన్ని అందిస్తోందని సారా స్కిన్నర్ కామెంట్ పోస్ట్ చేశాడు.

ఈ అవార్డుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4 వేలకుపైగా ఎంట్రీలు వచ్చాయి. మొత్తం 40 మంది ఫొటోలు ఫైనల్‌కు చేరుకోగా..పలు కేటగిరీలలో అవార్డులు గెలుచుకున్నాయి. క్రియేచర్స్ ఇన్ ది ఎయిర్ కేటగిరీలో క్రొయేషియాలో తీసిన రంగరంగుల పక్షుల ఫొటోకు అవార్డు వరించింది. ఫొటోగ్రఫీ పోటీల ద్వారా జీవరాశులను పరిరక్షణలో భాగంగా కామెడీ విల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డుల ప్రదాన కార్యక్రమం 2015 నుంచి ప్రారంభించారు.

హారీ వాకర్ తీసిన ఫొటోకు ఒలంపస్ క్రియేచర్స్ అండర్ ది వాటర్ అవార్డుతోపాటు పీపుల్స్ చాయిస్ అవార్డు వచ్చింది.

ఉడుతలకు సంబంధించి తొలి ప్రేమ..తొలి ముద్దు..జాయ్‌ఫుల్ డ్యాన్సింగ్..ది వెడ్డింగ్ సెర్మనీ సందేశాన్ని చూపిస్తూ ఉన్న ఎలైన్ క్రూయెర్ తీసిన ఫొటో అమేజింగ్ ఇంటర్నెట్ పోర్ట్‌ఫోలియో అవార్డు గెలుచుకుంది.


కామెడీ విల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డ్సు-2019లో టాప్ లో నిలిచిన ఫొటోలు..

2664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles