Sniffer Dogs | జూబ్లీహిల్స్, జూన్ 30: డ్రగ్స్ గుట్టురట్టు చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కొత్త వ్యూహాలకు తెరతీశారు. ఇకపై అనుమానిత ప్రదేశాల్లో స్నిఫర్ డాగ్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు పబ్‌లు, క్లబ్‌లలో పార్టీలు జరుగుతుండగానే నార్కోటిక్ ట్రైన్డ్ డాగ్స్‌తో తనిఖీలు చేపట్టనున్నారు. రహస్య ప్రదేశాలతో పాటు మనుషుల వద్ద కూడా డ్రగ్స్ వాసన కనిపెట్టేలా ఈ జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని పలు పబ్స్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు స్నిఫర్ డాగ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఒకవైపు పార్టీలు జరుగుతుండగానే మరోవైపు ఈ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ఐలు రాకేశ్, గోవర్ధన్, హరీశ్వర్‌రెడ్డి, గోపీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.