Rain Update | సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
అయితే మొన్నటి వరకు బెంబేలెత్తించిన ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఉష్ణోగ్రతలు దాదాపు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 35.9, కనిష్ఠం 23.5 డిగ్రీలు, గాలిలో తేమ 38 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.