చిక్కడపల్లి, జనవరి 21: చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆదివారం ఓ వృద్ధురాలు తిరుగుతుండగా పెట్రోలింగ్ సిబ్బంది గమనించి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇన్స్పెక్టర్ ఆమెను ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టి.. భోజనం పెట్టించారు.
ఆమె పేరు.. వివరాలు తెలుసుకున్నారు. వృద్ధురాలి పేరు నర్సమ్మ, భర్త వెంకటయ్య, కొత్తగూడెం వాసిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ను పలువురు అభినందించారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసిన వారు ఫొన్ నంబర్ 87126 60160లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ కోరారు.