Hair Pin in Biryani | హైదరాబాద్ : మణికొండలోని మెహ్ఫిల్ రెస్టారెంట్ నుంచి ఓ కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇక డెలివరీ అయిన తర్వాత తిందామని ఆ బిర్యానీ ప్యాక్‌ను ఓపెన్ చేసి ప్లేట్లో ఉంచగా, హెయిర్ పిన్ ప్రత్యక్షమైంది. దీంతో ఆర్డర్ చేసిన కస్టమర్ షాక్ అయ్యాడు. బిర్యానీలో హెయిర్ పిన్ ప్రత్యక్షమైన దృశ్యాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు బాధిత కస్టమర్.
ఈ పోస్టును ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సిటీ పోలీస్‌కు ట్యాగ్ చేశాడు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియజేశాడు.
హైదరాబాద్ మణికొండ రెస్టారెంట్ నుండి మెహ్ఫిల్ బిర్యానీలో హెయిర్ పిన్ వచ్చింది. ఎంత బాధ్యతారాహిత్యం.. అని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. ఈ ఘటనను గుర్తించిన హైదరాబాద్ సిటీ పోలీసులు వెంటనే స్పందించి, ఆ హోటల్ తమ పరిధిలోకి రాదని చెప్పి సైబరాబాద్ పోలీసులను సంప్రదించాల్సిందిగా ఫిర్యాదుదారుని ఆదేశించారు. 8712663061 అనే నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు.
మీరు వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు అంటూ హైదరాబాద్ పోలీసులకు కస్టమర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఇలాంటి రెస్టారెంట్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కస్టమర్ డిమాండ్ చేశారు.
Got safety pin in @MehfilBiryani from #Hyderabad #manikonda restaurant #hyderabadfoodsafety #FoodSafety #TrendingNews
How irresponsible 🤬@fssaiindia @foodsafetygov @hydcitypolice @foodsafetynews @KTRBRS @INCIndia pic.twitter.com/wzzoHXF5PA
— Actor Anirudh (@AnirudhActor) June 28, 2024