బొల్లారం, జూన్ 28: ట్రాఫిక్ పోలీసులకు ఓ మందుబాబు షాకిచ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బ్రీత్ అనలైజర్‌తో పరీక్షిస్తుండగా..ఆ పరికరంతో మందుబాబు పారిపోయాడు. గురువారం రాత్రి బోయిన్పల్లి పోలీసులు పుల్లారెడ్డి ఇంటి సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. ఇంతలో ఓ కారులోని డ్రైవర్‌ను పరీక్షిస్తుండగా, బ్రీత్ ఎన్‌లైజర్‌తో ఆ మందుబాబు ఉడాయించాడు. చీకటిగా ఉండటం..కారు స్పీడ్‌గా వెళ్లడంతో అతను ఎవరనేది గుర్తించలేకపోయారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని.. మందుబాబు కోసం గాలిస్తున్నారు.