Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
Harish Rao | 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం.. కానీ నువ్వు కనీసం లక్ష ఎకరాలకైనా ఇచ్చినవా..రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
Harish Rao | పాలమూరుకు కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నిన్న రేవంత్ రెడ్డి మా మహబూబ్‌నగర్ కు ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా..? అని అడుగుతుండు.. కేసీఆర్ పట్టించుకోలేదట.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అసలు సోయి.. ఉందా.. లేదా..? అని ప్రశ్నించారు.
నా దగ్గర డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉంది.. 30 ఏండ్లలో 30 వేల ఎకరాలకు మీరు నీళ్లిచ్చారు.. కాంగ్రెస్, టీడీపీ 30 ఏండ్ల పాలనలో.. రేవంత్ రెడ్డి నీ గురువు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు.. దత్తత జిల్లాలో నీ గురువుగారు.. ఇయ్యాళ్ల నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్.. 30 ఏండ్లలో శిలాఫలకాలు పెట్టుడు.. చెట్లు నాటుడని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
30 వేల ఎకరాలకు మీరు నీళ్లిస్తే కేసీఆర్ ఒక్క పాలమూరు జిల్లాకు 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారని స్పష్టం చేశారు. పాలమూరును వలసల జిల్లాను చేసిందే నీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు. పాలమూరును ఆగం చేసిందే మీరు..కానీ పచ్చపడగొట్టింది బీఆర్ ఎస్ ప్రభుత్వమని అన్నారు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక 2024లో చంద్రబాబు జీవో ఇచ్చి మరీ 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయాడు.మరి ఆ జీవోల గురించి ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? గురుదక్షిణలో భాగమా..? అని ప్రశ్నించారు.
4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం.. కానీ నువ్వు కనీసం లక్ష ఎకరాలకైనా ఇచ్చినవా..రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూనే ఈరోజు పాలమూరులో క్రాప్ హాలిడే ఇచ్చావని మండిపడ్డారు.
కృష్ణానది పాలమూరును ఒడిసి పట్టి పారుతది కదా..పక్కనే కృష్ణానది ఉన్నా ఇవాళ పాలమూరులో నువ్వు క్రాప్ డే ఇచ్చినవన్నారు. రైతులను పంటలు వేయొద్దన్నవ్.. నేడు పాలమూరు దాదాపు 2 లక్షల ఎకరాలు పంటలు ఎండిపోవడానికి నీ చేతగానితనం, నీ గురు దక్షిణే కారణమన్నారు.
పాలమూరుకు కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు
30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరులో కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు
కానీ కేసీఆర్ హయాంలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాము
కేవలం పాలమూరు ప్రాజెక్టుపైనే 28 వేల కోట్లు ఖర్చు చేశాము
నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక 2024లో చంద్రబాబు జీవో ఇచ్చి మరీ 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయాడు
మరి ఆ జీవోల గురించి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? గురుదక్షిణలో భాగమా?
పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూనే ఈరోజు పాలమూరులో క్రాప్ హాలిడే ఇచ్చావు
– హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
Karthika Pournami | యాదగిరిగుట్టలో భక్తుల సందడి
Microsoft Employee | 24 ఏళ్లు నమ్మకంతో పనిచేస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మెక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

