రేపు మద్యం అమ్మకాలు బంద్

Wed,September 11, 2019 09:55 AM

Wine shops to be closed tomorrow in Hyderabad

గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలు బంద్ అని పోలీసు కమిషనర్‌లు ఉత్తర్వులు జారీ చేశారు. 12వ నుంచి 13న సాయం త్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పోలీసు కమిషనర్‌ల ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీలు అంజనీకుమార్, మహేశ్‌భగవత్, సజ్జనార్ హెచ్చరించారు.

గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, ఆనందాయక వాతావరణంలో నిర్వహించేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్ అధికారులు పకడ్బందీ, పటిష్టమైన బందో బస్తును ఏర్పాటు చేశారు. చీమ చిటుకుమన్నా పోలీసులకు సెకన్లలో సమాచారం అందేలా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లో వైభవంగా జరిగే సామూహిక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు ట్రాఫిక్ విభాగం తరపున పూర్తి చేశామని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు, వాహనాల మళ్లింపులను విధించారు. ఈ ఆంక్షలు మళ్లింపులు 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13 వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. అత్యవసర పనులు ఉన్నవారు నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణానికి ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని కోరుతున్నారు.

టాఫిక్ మళ్లింపులు.. ఆంక్షలు ఇలా..

కూకట్‌పల్లి ఐడీఎల్ ట్యాంక్ వద్ద
ఐడీఎల్ ట్యాంక్ నుంచి రెయిన్‌బో విస్టా టీ జంక్షన్ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తారు.
ఐడీఎల్ ట్యాంక్ వద్ద నిమజ్జనాన్ని చూడడానికి వచ్చే వాహనదారుల వాహనాలను అనుమతించరు.
కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి హైటెక్ సిటీకి వచ్చే వాహనాలు జేఎన్‌టీయూ, ఫోరం మాల్ మీదుగా మాదాపూర్ హైటెక్‌సిటీకి చేరుకోవాలి.
హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్‌కు వయా ఖైత్లాపూర్ వైపు వచ్చే వాహనాలు రెయిన్‌బో విస్టా, మూసాపేట్ మీదుగా కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్‌కు చేరుకోవాలి.

ప్రగతినగర్ నుంచి జేఎన్‌టీయూ రోడ్డు మార్గంలో..
ప్రగతినగర్ నుంచి జేఎన్‌టీయూ రోడ్డును పూర్తిగా మూసివేస్తారు.
బౌరంపేట్ నుంచి బాచుపల్లికి వచ్చే వాహనాలు ప్రగతినగర్ కమాన్ బాచుపల్లి ఎక్స్ రోడ్డు వద్ద మళ్లిస్తారు.
జేఎన్‌టీయూ నుంచి వచ్చే వాహనాలను శ్రీనివాస స్టీల్స్, అదిత్యనగర్ ఎక్స్ రోడ్డు నిజాంపేట కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ వద్ద మళ్లిస్తారు.

అల్వాల్ హాస్మత్‌పేట్ ట్యాంక్ మార్గంలో..
బోయిన్‌పల్లి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు అంజయ్యనగర్ మీదుగా ప్రవేశించి నిమజ్జనం చేయాలి. అనంతరం ఖాళీ వాహనాలు పాతబోయిన్‌పల్లి, మజీద్ రోడ్డు, హరిజన బస్తీ మీదుగా వెళ్లిపోవాలి.

సురారం కట్టమైసమ్మ ట్యాంక్ వద్ద..
బాలానగర్ , జీడిమెట్ల నుంచి బహదూర్‌పల్లి, బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్‌కు వచ్చే వాహనాలను సురారం గ్రామం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, బౌరంపేట్, గండిమైసమ్మ వైపు మళ్లిస్తారు.
గండిమైసమ్మ, బాచుపల్లి నుంచి జీడిమెట్ల బాలానగర్ వైపు వచ్చే వాహనాలు బహదూర్‌పల్లి జంక్షన్ ఎడమ వైపు దూలపల్లి గ్రామం టీ జంక్షన్ ఐలా జీడిమెట్ల మీదుగా వెళ్లాలి.
విగ్రహాలతో వెళ్లే వాహనాలను ఫతేనగర్, సైబర్ టవర్స్, ఫోరం మాల్, గచ్చిబౌలీ ైఫ్లెఓవర్‌ల మీద అనుమతించరు.

భారీ వాహనాలకు ఈ మార్గంలో అనుమతి లేదు
బీహెచ్‌ఈఎల్ ఎక్స్ రోడ్డు-గోద్రెజ్ వై జంక్షన్, కూకట్‌పల్లి, బాలానగర్ నుంచి ఫతేనగర్ బ్రిడ్జి
ఫిరోజ్‌గూడ నుంచి గోద్రెజ్ వై జంక్షన్ కూకట్‌పల్లి
వీవీఎన్‌ఆర్ ైఫ్లె ఓవర్ నుంచి అరాంఘర్ ఎక్స్ రోడ్డులో భారీ వాహనాలకు అనుమతి లేదు.

భారీ వాహనాల మళ్లింపు
సంగారెడ్డి, పటాన్‌చెరువు, బీహెచ్‌ఈఎల్ నుంచి కూకట్‌పల్లి, హైదరాబాద్ సిటీకి వచ్చే వాహనాలను బీహెచ్‌ఈఎల్ ఎక్స్ రోడ్డు, యూ టర్న్, లింగంపల్లి, హెచ్‌సీయూ గచ్చిబౌలీ, టోలిచౌకీ మార్గంలో మళ్లిస్తారు.
బీహెచ్‌ఈఎల్, చందానగర్ , మియాపూర్ నుంచి అమీర్‌పేట్‌కు వచ్చే వాహనాలు మియాపూర్ ఎక్స్ రోడ్డు, బాచుపల్లి, దుండిగల్ రోడ్డులో ప్రయాణించాలి.
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నం.17(హిమాయత్‌సాగర్) , చెన్నమ్మ హోటల్ వయా ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు నుంచి వచ్చే వాహనాలను హిమాయత్ సాగర్ సర్వీసు రోడ్డు, దర్గా సర్వీసు రోడ్డు, లార్డ్స్ కాలేజీ, ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్, దర్గా, కిస్మత్‌పూర్-బుద్వేల్, పీడీపీ జంక్షన్ ఎడమ వైపు మళ్లిస్తారు.
పిల్లర్ నం.294(శివరాంపల్లి) పీడీపీ జంక్షన్ నుంచి వాహనాలను బుద్వేల్, కిస్మత్‌పూర్ గ్రామం , దర్గా నుంచి కూడి మలుపు తీసుకుని ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ వద్ద ఎడమకు తీసుకుని లార్డ్స్ కాలేజీ , టీఎస్‌పీఏ జంక్షన్ హిమాయత్ సాగర్ టోల్‌గేట్ వైపు మళ్లిస్తారు. పోలీసుల సూచనలను వినాయక విగ్రహాలతో వచ్చే వాహనదారులు, సాధారణ వాహనదారులు పాటించి సెప్టెంబరు 12 సురక్షితంగా, ట్రాఫిక్ రద్దీని సృష్టించకుండా ప్రయాణించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ కోరారు.

2021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles