గణేస్ నిమజ్జనాలపై సమీక్ష సమావేశం

Mon,August 19, 2019 09:53 PM

review meeting on Ganesh immersion

హైదరాబాద్: సెప్టెంబర్ 2వ తేదీన వినాయక చవితి. ఈ నేపథ్యంలో నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో జరిగే గణేష్ నిమజ్జనాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముషారఫ్ అలీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 12న తేదీన సామూహిక గణేష్ నిమజ్జనాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 29 క్రేన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ మార్గ్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు పారిశుద్ధ్యం నిర్వహణకు అదనపు సిబ్బంది నియమించనున్నట్లు పేర్కొన్నారు.

715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles