డిసెంబర్ 8న మిసెస్ మామ్ కాంటెస్ట్

Wed,November 20, 2019 06:33 AM

హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో మంగళవారం కిమ్స్ కడిల్స్ ఆధ్వర్యంలో మిసెస్ మామ్ 2వ సీజన్ పోటీ వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. గర్భిణిలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం. డిసెంబర్ 8న మిసెస్ మామ్ కంటెస్ట్ నిర్వహిస్తున్నామని కిమ్స్ కడిల్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ డాక్టర్ శిల్పారెడ్డి తెలిపారు. ఈవెంట్‌కు ముందుగానే 8897993265కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆడిషన్స్ వచ్చే నెల 1న జరుగుతాయని పేర్కొన్నారు. విజేతలకు ఉచిత డెలివరీ, బహుమతులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్రర్స్ సెలూన్ అకాడమీ వ్యవస్థాపకురాలు డాక్టర్ విజయలక్షి, ఫ్యాషన్ డిజైనర్ మిస్ మన్సీ ఉప్పల తదితరులు పాల్గొన్నారు.

364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles