ఎంఎంటీఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ మృతి

Sat,November 16, 2019 10:19 PM

హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఎంఎంటీఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రశేఖర్ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈనెల 11న హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో లోకోపైలెట్‌తో సహా 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో రెండు రోజుల క్రితం కుడికాలుని వైద్యులు పూర్తిగా తొలగించారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రశేఖర్ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. రెండు రైళ్ల మధ్య నలిగి చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ మధ్య రైల్వే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ విభాగం సుమారు 8 గంటల పాటు శ్రమించి అతన్ని అతి కష్టం మీద బయటకు తీసింది.

1371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles