అత్త హత్య కేసులో నిందితురాలిగా తేలిన కోడలు

Mon,August 19, 2019 07:34 PM

daughter in law to be found guilty in her aunt murder case

హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్ట పరిధి హోషామాబాద్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మార్చి 30న మంచం పైనుంచి పడి తన అత్త చనిపోయినట్లు కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అత్త ఖైరున్ బేగం మృతిపై చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో కోడలు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీరతో గొంతు బిగించి చంపినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. విచారణలో అనారోగ్యంతో ఉన్న అత్తకు సేవ చేయలేక హత్య చేసినట్లు కోడలు వెల్లడించింది.

1892
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles