జిల్లా కలెక్టర్లతో సీఎస్ ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్

Thu,July 11, 2019 04:01 PM

cs sk joshi video conference with district collectors

హైదరాబాద్: సీఎస్ ఎస్కే జోషి జిల్లా కలెక్టర్లతో సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయో మెడికల్ వేస్ట్, నదుల కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్, అక్రమ ఇసుక మైనింగ్ అంశాలకు సంబంధించి ఎన్‌జీటీ జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందించాలి. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి జీడిమెట్లలో ఉన్న ప్లాంట్‌ను రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లకు చూపించాలి. పట్టణ, గ్రామాలకు డంపింగ్ యార్డులు ఉండేలా చర్యలు చేపట్టాలి. చెత్తను వేరు చేయడంపై హౌస్‌హోల్డ్స్‌ను చైతన్యం చేసేలా జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. చెత్త సేకరణకు అవసరమైన ఆటోలు, రిక్షాలు సమకూర్చుకోవాలని సీఎస్ తెలిపారు.

1052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles