ప్రమాద కారకుడు బాలుడితో పాటు తండ్రి అరెస్టు

Mon,August 19, 2019 07:30 PM

Boy arrested along with his father in an accident case

సికింద్రాబాద్: నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నిన్న ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ప్రమాదానికి కారణమైన బాలుడితో పాటు అతడి తండ్రిని అరెస్టు చేశారు. బాలుడితో పాటు తండ్రి నూరుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితులు ఆటోలో బోయినపల్లిలోని మిలిటరీ డెయిరీఫామ్ రోడ్డు మీదుగా యాప్రాల్ వెళ్లేందుకు లాల్‌బజార్‌వైపు వెళ్తున్నారు. ఇంతలోనే ఇందిరానగర్ నుంచి అతివేగంగా రాంగ్‌రూట్‌లో దూసుకువచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

1001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles