అయోధ్య తీర్పు అనంతరం హైదరాబాద్‌లో భారీ బందోబస్తు

Sat,November 9, 2019 06:35 PM

హైదరాబాద్: ఇవాళ వివాదాస్పద అయోధ్య తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఈ కేసు తుది తీర్పు ఇవాళ వెలువడింది. ఆ స్థలం మొత్తం రామజన్మ భూమేననీ, సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నయంగా అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎలాంటి దుష్పరిమాణాలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలు సిటీలోని ప్రధాన ప్రాంతాలైన చార్మినార్, మక్కామసీదు, గోల్కొండ మొదలగు ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఎలాంటి అమానవీయ చర్యలు జరగకుండా వారు భద్రత నిర్వహిస్తున్నారు. కాగా, ఈ తీర్పును హిందువులు సహా ముస్లింలు సైతం స్వాగతించడం హర్షించదగ్గ విషయం.
3027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles