నవంబర్‌ 9 శనివారం 2019..మీ రాశిఫలాలు

Sat,November 9, 2019 06:08 AM


మేషం

మేష రాశి : ఈ రోజు బద్ధకం అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరుల వ్యవహారాల్లో ఓపిక అవసరం. తొందరపాటు పనికి రాదు. ఆర్థికంగా అంతగా అనుకూలంగా ఉండదు. అనుకోని ఖర్చులు ఉంటాయి.

వృషభం

: వృషభం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు.

మిథునం

: మిథునం : కొత్త పనులు పారంభించటానికి, వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయటానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ఉద్యోగార్థులు అనుకూల ఫలితం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, నూతన ఒప్పందాలు పూర్తి చేస్తారు.


కర్కాటకం

: కర్కాటకం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులలో అజాగత్త, తొందరపాటు పనికి రాదు. మీ తొందరపాటు వల్ల డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి ఉద్యోగం విషయంలో అనుకూల ఫలితాలుంటాయి.

సింహం

: సింహం : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నడుము లేదా వెన్నుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడే అవకాశముంటుంది. ఆర్థికంగా అనుకోని విధంగా ఖర్చులు పెరగడం లేదా వ్యాపారంలో నష్టం రావడం జరగవచ్చు. పెట్టుబడులకు నూతన ఒప్పందాలకు అనుకూలమైన రోజు కాదు.

కన్య

: కన్య : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కొద్దికాలంగా ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు.

తుల

: తుల : ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. కొద్దికాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి పరంగా ఒక శుభవార్త వింటారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

: వృశ్చికం : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగత్త అవసరం. గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా గుండెమంట మిమ్మల్ని బాధించే అవకాశమున్నది. ఆహారం విషయంలో జాగత్త అవసరం. మానసికంగా ఏదో తెలియని ఆందోళనకు లోనవుతారు. గృహ సంబంధ విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

ధనుస్సు

: ధనుస్సు : ఈ రోజు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి విషయంలో అనుకోని మార్పులు ఉంటాయి. వాహనం కొనుగోలు చేయటం కానీ, మరమ్మత్తు చేయటం కానీ చేస్తారు. మానసిక ఒత్తిడికి లోను కాకుండా పనులను పూర్తి చేయండి. ఆర్థిక వ్యవహారాలకు, పెట్టుబడులకు అంతగా అనుకూలించే రోజు కాదు.

మకరం

: మకరం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పైఅధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తిలో మార్పు కానీ, అభివృద్ధి కానీ ఉంటుంది. చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది.

కుంభం

: కుంభం : ఈ రోజు ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం మంచిది కాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సంగీతం వినడం లేదా ఏదైనా వినోద కార్యకమంలో పాల్గొనడం మంచిది.

మీనం

: మీనం : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. అయితే ఖర్చుల స్థాయి కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఆదాయం బాగుండటం వల్ల అది ఇబ్బంది కలిగించదు. మీ వృత్తికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీరు చేయాలనుకుని వాయిదా వేస్తున్న పనులను పూర్తి చేస్తారు.


4450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles