శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులు అనుభవజ్ఞుల సహకారంతో పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. వృథా చర్చలకు దూరంగా ఉండటం మంచిది. శివారాధన మేలుచేస్తుంది.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూ వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కోర్టు కేసులలో అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. దాయాదులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. ప్రయాణాలు వాయిదా పడతాయి. పనిభారం పెరగడంతో కొంత అలసటకు గురవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సంతోషంగా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. పనుల్లో కాలయాపన, వృథా ఖర్చులు ఉండవచ్చు. రాజకీయ, ప్రభుత్వ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
సమాజంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడం అవసరం. బంధువర్గం, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వినాయకుడి గుడిని సందర్శించండి.
తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు, రుణబాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఓపికతో పనులు పూర్తిచేయడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపాలి. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చుల మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. భూ వివాదాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన పనుల్లో పెద్దల సహకారం లభిస్తుంది. శివాలయాన్ని సందర్శించండి.
ఉల్లాసంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్న పనులపై దృష్టి సారించండి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో మనస్పర్ధలు రావచ్చు. పదోన్నతి, స్థానచలన సూచన. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.
అదృష్టం కలిసివస్తుంది. నిలిచిపోయిన పనులు ముందుకు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త మార్గాలు అన్వేషిస్తారు. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. విందులకు హాజరవుతారు. ప్రశాంతంగా ఉంటారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
వ్యాపారులకు అనుకూల సమయం. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పై చదువులకు అడ్డంకులు తొలగుతాయి. కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. చాలాకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్తగా పరిచయం అయినవారితో అప్రమత్తంగా ఉండాలి. దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంయమనం పాటించడం అవసరం. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలతో ఖర్చులు పెరగవచ్చు. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. కొత్త వ్యాపార ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. హుందాగా ఉంటారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. రామాలయాన్ని సందర్శించండి.
– గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in