టైప్ 2 డయాబెటిస్, హైబీపీ పేషెంట్లలో విటమిన్ డి లోపం ఎక్కువేనట..!


Thu,August 29, 2019 12:49 PM

మన శరీరానికి కావల్సిన పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. దీన్ని మన శరీరం తనకు తానే సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటుంది. అలాగే గుడ్లు, పాలు, పాల సంబంధ ఆహార పదార్థాలు, పుట్టగొడుగులు, చేపల్లోనూ మనకు విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి వల్ల మన శరీరం కాల్షియాన్ని సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. అయితే మన దేశంలో టైప్ 2 డయాబెటిస్, హైబీపీతో బాధపడుతున్న వారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

ముంబైకి చెందిన శుశ్రుత హాస్పిటల్ డయాబెటాలజిస్టు డాక్టర్ పీజీ తల్వాల్కర్ చేసిన అధ్యయనం ప్రకారం మన దేశంలో ఉన్న 84.2 శాతం మంది టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు, 82.6 శాతం మంది హైబీపీ పేషెంట్లలో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉందని వెల్లడైంది. నిత్యం శరీరానికి తగినంత సూర్యరశ్మి అందకపోతుండడం వల్లే విటమిన్ డి లోపం వస్తుందని నిర్దారించారు. అయితే విటమిన్ డిని నిత్యం అందేలా చేసుకుంటే ఎముకలను దృఢంగా మార్చుకోవచ్చని, దాంతోపాటు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడడం, విపరీతంగా అలసిపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

4374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles