Health Tips : మనలో చాలా మంది పొట్టలో కొవ్వు కరిగించడానికి ఎన్నో అవస్ధలు పడుతుంటారు. అయితే మీరు నిద్రిస్తూనే ఎంచక్కా రిలాక్సింగ్‌గా, టేస్టీ పద్ధతిలో బరువు తగ్గే ప్రక్రియ అందుబాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌టైం టీతో పొట్టలో కొవ్వును కరిగించేయవచ్చని సూచిస్తున్నారు. ఈ టీతో కొవ్వును కరిగించడంతో పాటు హార్మోన్ల సమతుల్యత సాధించవచ్చని, గ్యాస్, కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలను అధిగమించవచ్చని న్యూట్రిషనిస్ట్ ఖ్యాతి రూపాని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
రాత్రి వేళ తీపి పదార్ధాలను పక్కనపెట్టి పొట్టలో కొవ్వు కరిగించే బెడ్‌టైం టీని సిప్ చేయాలని ఆమె సూచిస్తున్నారు. ఈ టీలో ఉండే వాము, సోంప్ వంటివి భారత్‌లో శతాబ్ధాలుగా వాడే ఔషధాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు. సోంప్‌తో జీర్ణక్రియ సాఫీగా సాగి ప్రేవుల ఆరోగ్యం మెరుగవుతుంది.
ఇక యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్‌గా పేరొందిన పసుపును కూడా ఈ టీలో వాడాలని ఖ్యాతి సూచించారు. ఇది శరీరంలో కొవ్వును రెగ్యులేట్ చేయడంతో పాటు ఆకలి వేయడాన్ని తగ్గిస్తుందని ఇది బరువు తగ్గేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. కొత్తిమీరను కూడా టీలో వాడితే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంతో పాటు జీర్ణశక్తి మెరుగవుతుంది.
Read More :
Janhvi Kapoor: జలకన్యలా జాన్వీ కపూర్.. ఇన్‌స్టాలో పారిస్ ఫోటోలు రిలీజ్