నిలోఫర్‌లో న్యూమోనియా నివారణకు ప్రత్యేక చర్యలు

Thu,December 26, 2019 06:39 AM

హైదరాబాద్: శీతాకాలం నేపథ్యంలో చలి తీవ్రత కారణంగా చిన్నారుల్లో న్యూమోనియా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిలోఫర్‌లో న్యూమోనియా బాధిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు దవాఖాన వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి రోజు కనీసం 10కి పైగా న్యూమోనియా కేసులు వస్తుంటాయని అందులో ఒకటి రెండు కేసులు క్లిష్టంగా ఉంటున్నట్లు నిలోఫర్‌ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా చల్లదనం, జలుబు, ఇన్‌ఫెక్షన్స్‌తో ఈ న్యూమోనియా వ్యాధి చిన్న పిల్లల్లో వస్తుందని దీనికి సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. న్యూమోనియా బాధిత చిన్నారుల కోసం వామర్స్‌, నెబ్‌లైజర్స్‌, వెంటిలెటర్‌ వంటి వైద్యోపకరణాలను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు వివరించారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్స్‌ తగ్గేందుకు అవసరమైన చికిత్స అందించేందుకు దవాఖానలో మరిన్ని అదనపు సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

1387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles