అతిగా నిద్రిస్తే అనర్థమే..!

Tue,November 5, 2019 11:29 AM

నిత్యం ఎవరైనా సరే.. 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రించాలని వైద్యులు చెబుతుంటారు. దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే నిర్దేశించిన సమయం కాకుండా రోజూ అంతకన్నా ఎక్కువ గంటలపాటు నిద్రించే వారు కూడా చాలా మందే ఉన్నారు. అంటే 8 గంటలకు పైగా నిద్రించే వారన్నమాట. ఈ క్రమంలోనే మన శరీరానికి నిద్ర అవసరమే అయినా అది ఎక్కువైతే మాత్రం ఎలాంటి లాభాలు కలగకపోగా అన్నీ నష్టాలే కలుగుతాయి. మరి అతిగా నిద్రిస్తే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!


* అతిగా నిద్రించడం వల్ల బరువు పెరుగుతారు. శరీరం కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది.

* తలనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

* డిప్రెషన్, మానసిక సమస్యలు, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.

* ఎప్పుడూ విపరీతమైన అలసట ఉంటుంది. ఏ పనీ చేయబుద్ది కాదు. చిన్న పని చేసినా అలసిపోతుంటారు.

* వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతాన సాఫల్యత సమస్యలు వస్తాయి.

* నిత్యం అతిగా నిద్రించే వారు త్వరగా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

4248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles