ముక్కు దిబ్బడను వెంటనే తగ్గించే ఇంటి చిట్కాలు..!

Wed,November 27, 2019 11:05 AM

చలికాలంలో సహజంగానే ఎవరినైనా జలుబు, ముక్కు దిబ్బడ ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే కొందరికి జలుబు ఉండదు కానీ ముక్కు దిబ్బడ మాత్రం ఉంటుంది. దీంతో గాలి పీల్చుకోవడం కష్టతరమవుతుంది. అయితే కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


* గోరు వెచ్చని నీటిని కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం నీటి నుంచి కొన్ని చుక్కలను తీసుకుని ముక్కు రంధ్రాల్లో వేయాలి. దీంతో ముక్కులో ఉండే శ్లేష్మం కరుగుతుంది. ఫలితంగా ముక్కు రంధ్రాలు క్లియర్ అయి శ్వాస సరిగ్గా ఆడుతుంది.

* రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని బాగా నలిపి వాటిని అలాగే తిన్నా లేదంటే వాటిని మెత్తగా పేస్ట్‌లా చేసి గోరు వెచ్చని నీటిలో ఆ మిశ్రమాన్ని కలిపి తాగినా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

* ముక్కు దిబ్బడను తగ్గించేందుకు ఉల్లిపాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి బాగా కలిపి రోజుకు 3 పూటలా తాగితే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆ మిశ్రమంలో తేనె కలిపితే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది.

* నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని కలిపి ముక్కుపై రాయాలి. కొంత సేపటికి ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

* నిత్యం రెండు సార్లు టమాటా జ్యూస్‌ను తాగితే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు.

4798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles