ఈ రెండు బెర్రీలను రోజూ తింటే.. అధిక బరువు తగ్గుతారు..!


Tue,August 20, 2019 04:19 PM

అధిక బరువును తగ్గించుకునేందుకు నానా యాతనా పడుతున్నారా..? బరువు తగ్గించే డైట్ ఏదో తెలియక సతమతమవుతున్నారా..? అయితే ఏం ఫర్లేదు. ఈ రెండు రకాల బెర్రీలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోండి చాలు.. దాంతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ బెర్రీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

స్ట్రాబెర్రీలు...


స్ట్రాబెర్రీలలో మన శరీరానికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. జీర్ణ సమస్యలను పోగొడతాయి. అధిక బరువు ఉన్న వారు స్ట్రాబెర్రీలను నిత్యం తీసుకుంటే ఫలితం ఉంటుంది.
మల్బెర్రీలు...


ఇవి సహజసిద్ధమైన తీపి రుచిని కలిగి ఉంటాయి. అందువల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఈ బెర్రీలను మనం వాడవచ్చు. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్, దాలియా(గోధుమ రవ్వ ఉప్మా)లలో మల్బెర్రీలను వేసుకుని తినవచ్చు. దీంతో అధిక బరువును తగ్గించుకోవడం సులభతరమవుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.

4419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles