హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధిని ప్రారంభం దశలోనే గుర్తిస్తే నివారించవచ్చని ఎంఎన్‌జే క్యాన్సర్ హస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత అన్నారు. ప్రపంచ క్యాన్సర్ అవగాహన ముగింపు సదస్సు బుధవారం ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో 60 శాతం రోగులు వ్యాధి ముదిరిన తర్వాత దవాఖానకు వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించే క్రమంలో ఎంఎన్‌జే హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డాక్టర్ జయలత చెప్పారు. గతంలో పెద్ద ఎత్తున అవగాహన వాక్‌లు నిర్వహించినట్లు ఆమె గుర్తు చేశారు. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఎంఎన్‌జె సిబ్బంది పాల్గొన్నారు.