పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చారా? వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసినట్టే.. వీడియో

Fri,June 28, 2019 05:20 PM

ఎవరి పిల్లలు వాళ్లకు ముద్దే. కానీ.. పిల్లలపై అతి గారాబం వాళ్లకే చేటు చేస్తుంది. పిల్లలు ఏది అడిగితే అది కొనిస్తారు పేరెంట్స్. మేం ఏది చేసినా పిల్లల కోసమే కదా. వాళ్లు అడిగింది ఇవ్వకపోతే ఎట్లా? అని అంటారు తల్లిదండ్రులు. వాళ్లు అడిగిందల్లా కొనిస్తున్నారు ఓకే.. కానీ.. వాళ్లు ఏం అడుగుతున్నారు? మీరు ఏం కొనిస్తున్నారు? అనేది చాలా ముఖ్యం. వాళ్లు ఓ చాకోలెట్ కావాలని అడిగితే కొనివ్వడంలో తప్పు లేదు. ఏవైనా బొమ్మలు కావాలంటే కొనివ్వడంలో తప్పు లేదు. ఇంకా ఏదో కావాలంటే కొనిస్తారు.. అలాగే వాళ్లు స్మార్ట్‌ఫోన్ కావాలంటే కూడా కొనిస్తారా? స్మార్ట్‌ఫోనేగా వాళ్లు అడిగేది.. దాని వల్ల వాళ్లకూ టెక్నాలజీ తెలుస్తుంది కదా. పోనీ.. కొనిద్దాం అని అనుకొని కొనిచ్చారో? అంతే సంగతులు.


మీ పిల్లలకు మీరు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారంటే.. వాళ్లు మీరు డ్రగ్స్ అలవాటు చేసినట్టే. ఎహె.. ఊరుకోండి. స్మార్ట్‌ఫోన్‌కు, డ్రగ్స్‌కు ఏంటి సంబంధం అంటారా? సంబంధం ఉంది. చాలా ఉంది. పిల్లలు స్మార్ట్‌ఫోన్ పట్టుకొని వదలడం లేదంటే వాళ్లు డ్రగ్స్‌కు అలవాటు అయినట్టే. అంతే కాదు.. వాళ్లకు స్మార్ట్‌ఫోన్ తప్పించి ఇంకో లోకం ఉండదు. చదువులోనూ వెనుకబడిపోతారు. వాళ్ల భవిష్యత్తును మీరే.. మీ చేజేతులారా నాశనం చేస్తున్నారు. డిటెయిల్‌గా తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియో చూడండి.

7126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles