చలికాలం లెమన్ వాటర్‌తో ఎన్నో లాభాలు..!

Mon,November 4, 2019 01:38 PM

చలికాలంలో సహజంగానే ఎవరికైనా సరే శరీరం బద్దకంగా అనిపిస్తుంది. అలాగే ఒత్తిడి, మానసిక ఆందోళనలు సతమతం చేస్తుంటాయి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే పలు శ్వాసకోశ సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఈ సీజన్‌లో నిత్యం లెమన్ వాటర్ తాగాలి. గోరువెచ్చని నీటిని ఒక గ్లాస్‌లో తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగితే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. చలికాలంలో సహజంగానే చర్మం పొడిబారుతుంది. అయితే ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల చర్మంలో తేమ అలాగే ఉంటుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. అలాగే నిమ్మరసంలో ఉండే విటమిన్ చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

2. చలికాలంలో బాధించే శ్వాసకోశ సమస్యలకు లెమన్ వాటర్‌తో చెక్ పెట్టవచ్చు. ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి.

3. చలికాలంలో సహజంగానే శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అయితే లెమన్ వాటర్ తాగితే ఆ శక్తిని పెంచుకోవచ్చు. దీంతో ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ఉంటాయి.

4. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

5. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు, జీర్ణ సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం తాగడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

4023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles