సామాజిక రుగ్మత


Tue,December 3, 2019 12:29 AM

దేశవ్యాప్తంగా లైంగికదాడులను కట్టడానికి పార్లమెంటులో సోమవారం రిగిన చర్చ అసమగ్రంగానే ముగిసింది. అందుకేనేమో కొందరు సభ్యులు తమ రాష్ర్టాలలోని ఘటనలను ప్రస్తావిస్తూ ఈ అంశంపై మరింత కూలంకష చర్చ సాగాలనే సూచనలు చేశారు. ఈ కొద్ది పాటి చర్చలో కొందరి అభిప్రాయాలు సగటు మనిషి ఆందోళనను వ్యక్తం చేసేవిగా ఉంటే, మరికొందరి సూచనలు పరిగణించేవిగా ఉన్నాయి. లైంగికదాడికి పాల్పడిన వారి బహిరంగంగా మూకదాడికి గురి చేయాలనే ఒక సభ్యురాలి సూచన సమాజంలో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతున్నది.

మహిళలపై లైంగికదాడులను అరికట్టే విషయమై పార్లమెంటు ఉభయసభలు చర్చించడం వల్ల ఈ దిశగా అర్థవంతమైన చర్యలు తీసుకోవచ్చనే ఆశ కలుగుతున్నది. మహిళలపై లైంగికదాడుల పట్ల దేశవ్యాప్తంగా కలవరం చెలరేగుతున్న దశలో, పార్లమెంటు ఇప్పటికైనా ఈ అంశంపై సత్వరం స్పం దించి చర్యలు తీసుకోవాలె. ఢిల్లీలో నిర్భయ ఉదంతం మాదిరిగా కొన్ని సందర్భాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. మీడియాలో ప్రాముఖ్యం పొందనప్పటికీ దేశవ్యాప్తంగా లైంగికదాడులు తీవ్రస్థాయిలో సాగుతున్నాయి. గత బుధవారం హైదరాబాద్‌ నగరంలో ఒక మహిళపై నలుగురు లారీ సిబ్బంది బలత్కారానికి పాల్పడి దహనం చేయడం తీవ్ర ఆందోళనను కలిగించింది. ఇటీవలే హన్మకొండలో కూడా ఒక బాలికపై తెలిసిన వ్యక్తే లైంగికదాడి జరిపి హతమార్చాడు. అసిఫాబాద్‌లోనూ ఒక మహిళపై లైంగికదాడి జరిపి హత్య చేశారు. గత గురువారం నాడు తమిళనాడులో ని నేవేలిలో ఒక 32 ఏండ్ల మహిళపై ఐదుగురు లైంగికదాడి చేశారు. కాంచీపురంలో అదృశ్యమైన ఇరువై ఏండ్ల మహిళ మృతదేహం గురువారంనాడు కనబడ్డది. తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. చండీగఢ్‌లో పదకొండేండ్ల బాలికను బంధువు రైల్వే స్టేషన్‌లో వదిలేసింది. ఆమె ఒంటరిగా ఇంటికి పోతున్నప్పుడు ఆటోవాలా నిర్బంధించి కొన్నిరోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వడోదరలో శుక్రవారం పద్నాలుగేండ్ల బాలికపై ఇద్దరు పలుమార్లు లైంగికదాడి చేసి పరారయ్యారు. రాంచీలో గత నెల 26వ తేదీన 25 ఏండ్ల న్యాయ విద్యార్థినిని పన్నెండు మం ది అపహరించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఒక వారం రోజుల వ్యవధిలో సాగిన లైంగికదాడుల ను గమనించినా మనసు వికలమవుతుంది. సభ్య సమాజమని చెప్పుకుంటున్నప్పటికీ మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతుంది.

నైతిక విలువల పతనం కూడా ఈ లైంగికదా డులకు మూలమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సాంకేతికాభివృద్ధి మూలంగా సెల్‌ఫోన్‌లో నే అనేక అసభ్య రాతలు, దృశ్యాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ప్రభావితమైన యువత తప్పుదోవపడుతున్నది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని లైంగికదాడులను అరికట్టడానికి సమగ్ర కార్యాచరణ చేపట్టాలె. ఒకప్పు డు మహిళలు ఇంటికే పరిమితమై ఉండేవారు. విస్తృత నగరాలు ఉండకపోవడం వల్ల మనుషు లు, పరిసరాలు తెలిసి ఉండేవి. నైతిక విలువల ప్రభావం కూడా ఉండేది. మహిళలపై గృహ హింస, వరకట్న బాధలు ప్రధాన చర్చానీయాంశాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు నగరాలలో మహిళలు ఉద్యోగాలు చేయడం పరిపాటి. మహిళలకు లైంగికదాడుల నుంచి రక్షణ కల్పించడానికి మారుతున్న పరిస్థితులకు అనుగుణమైన ఏర్పా ట్లు ఉండాలె. మహిళలపై లైంగికదాడులను మరింత విస్తృతమైన రీతిలో అర్థం చేసుకోవాలె. వీధు ల్లో, విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో వేధింపులకు గురిచేయడం కూడా మహిళల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మహిళా పార్లమెంటు సభ్యుల్లో 82 శాతం మంది లైంగిక అవమానాలకు గురైనవారేనని ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ వివిధ ఖండాల్లోని 39 దేశాల్లో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దీనినిబట్టి ఈ జాడ్యం ఎంత లోతుగా పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా లైంగికదాడులను కట్టడానికి పార్లమెంటులో సోమవారం రిగిన చర్చ అసమగ్రంగానే ముగిసింది. అందుకేనేమో కొందరు సభ్యులు తమ రాష్ర్టాలలోని ఘటనలను ప్రస్తావిస్తూ ఈ అంశంపై మరింత కూలంకష చర్చ సాగాలనే సూచనలు చేశారు. ఈ కొద్ది పాటి చర్చలో కొందరి అభిప్రాయాలు సగటు మనిషి ఆందోళనను వ్యక్తం చేసేవిగా ఉంటే, మరికొందరి సూచనలు పరిగణించేవిగా ఉన్నాయి. లైంగిక దాడికి పాల్పడిన వారి బహిరంగంగా మూకదాడికి గురి చేయాలనే ఒక సభ్యురాలి సూచన సమాజంలో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతున్నది. కొందరు గస్తీ పెం చాలనే సూచనలు ఇస్తే, మరికొందరు చట్టాలను కఠినతరం చేయాలన్నారు. కేంద్రం చట్టాలను మార్చడానికి సంసిద్ధతను వ్యక్తంచేసింది. చట్టాలు మార్చడంతో సరిపోదని, రాజకీయ చిత్తశుద్ధి, పరిపాలనా నైపుణ్యం ఉండాలనే అభిప్రాయం ఆలోచింపదగినది. ప్రజల ఆలోచనాతీరు మారాలనేది అన్నిటికన్నా ప్రధానమైన పరిగణింపదగిన సూచన. ఇందుకోసం ఏమి చేయాలనే దిశలో చర్చ సాగాలె. మతాల కోణంలో ఆలోచించకుండా, వ్యవస్థలో లోపాన్ని ఎట్లా చక్కదిద్దాలనేది చర్చించాలె. నిర్భయపై లైంగికదాడికి పాల్పడినవారు ఇంకా జైలులోనే ఉండటమేమిటనే వ్యాఖ్య లు వినబడుతున్నాయి. అంటే ఖైదు చేయడాన్ని ప్రజలు శిక్షగా భావించకపోగా, మరణదండనే పరిష్కారంగా భావిస్తున్న పోకడ ఇది. ప్రజలలో నెలకొన్న ఆగ్రహాన్ని ఈ అభిప్రాయం ప్రతిబింబిస్తున్నది. అయితే చట్టాలు చేసేవారు ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని పంచుకుంటూనే, ఈ సామాజిక రుగ్మతకు హేతుబద్ధమైన పరిష్కారాన్ని అన్వేషించాలె. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సత్వర విచారణ సాగించాలని ఆదేశించడం ఈ దిశగా ఒక నిర్దిష్ట చర్య. నేరస్తులను పట్టుకోవడం, సత్వర విచారణ సాగించి శిక్షించడం ఒక అంశం. అత్యాచారాలను అరికట్టడం అంతకు మించిన సవాలు. ఇందుకు సమాజపరంగా అన్నివర్గాలు ముందుకురావాలె.

220
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles