ఎగవేతదారులను దాయొద్దు!


Tue,December 3, 2019 12:28 AM

2011లో ఆర్‌బీఐ నుంచి ఉద్దేశపూర్వక అప్పు ఎగవేతదారుల జాబితా కావాలని స.హ.చట్టం కింద అడిగిన విన్నపాలు సెంట్రల్‌ ఇన్ఫర్మేష న్‌ కమిషన్‌ (సీఐసీ) చెంతకు చేరాయి. దీంతో సీఐసీ కమిషనర్‌ శైలేష్‌ గాంధీ ఎగవేతదారుల జాబితా వెల్లడించాలని ఆర్‌బీఐని ఆదేశించారు. ఈ క్రమంలో ఎగవేతదారుల పేర్లు ప్రకటించినంత మాత్రాన బ్యాంకులు విశ్వసనీయతను కోల్పోతాయని, ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడుతుందన్నదాన్ని తోసిపుచ్చారు. దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం జరుగనంతవరకు ఎగవేతదారుల పేర్లు ప్రకటించవచ్చని తేల్చిచెప్పారు.

బ్యాంకులకు అప్పు ఎగవేతదారుల పేర్లు బయటపెట్టాలని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను చాలామంది ఎంతోకాలంగా కోరుతున్నారు. కానీ వ్యక్తిగత గోప్యత హక్కు, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా బయటపెట్టజాలమని బ్యాంకులు, ప్రభుత్వం చెబుతూవచ్చాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, కావాలని అప్పులు ఎగవేస్తున్న వారి పేర్లు బయటపెట్టాలని స.హ.చట్టం కింద సుప్రీంకోర్టుకు వినతి చేసుకోవటంతో చివరికి సుప్రీంకోర్టు అప్పు ఎగవేతదారుల పేర్లు చెప్పాలని ఆర్బీఐని ఆదేశించింది. ఆ క్రమంలో ఇప్పు డు ఓ ముప్ఫై మంది అతిపెద్ద అప్పువేతదారుల పేర్లు బయటపెట్టింది.

గత పదేండ్లుగా స.హ.చట్టం కింద వచ్చిన విజ్ఞాపనలను ఆర్బీఐ తిర స్కరిస్తూ వచ్చింది. దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రుణ ఎగవేతదారు ల పేర్లు బయటపెట్టలేమని, బ్యాంకులకు, రుణగ్రహీతలకు మధ్య ఉన్న విశ్వసనీయతకు భంగకరమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఎన్నివైపు ల నుంచి ఎగవేతదారుల పేర్లను బయటపెట్టాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారుల పేర్లు సెంట్రల్‌ బ్యాంకు వద్ద ఉన్నా, వాటిని వివిధ బ్యాంకుల వారీగా ఉన్న ఎగవేతదారుల పేర్లు ఇవ్వటానికి కూడా సిద్ధపడలేదు.

ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్‌ బ్యాంక్‌ రుణ ఎగవేతదారులు ముప్ఫై మంది లిస్టులో మెహుల్‌ చోక్సీకి చెందిన మూడు కంపెనీ లు కూడా ఉన్నాయి. ఈ పెద్ద కంపెనీలు ఎగవేసిన అప్పుల మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ మాఫీ చేసిన మొత్తం కూడా రూ.50 వేల కోట్లపై మాటే. ఈ క్రమంలోంచే చూస్తే దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు అప్పులు ఎగవేసిన వాటిలో 2018 డిసెంబర్‌ నాటికి 11 వేల కంపెనీలున్నాయి. ఈ కంపెనీలు ఎగవేసిన మొత్తం ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ డాటా ప్రకారం 1.61 లక్షల కోట్ల రూపాయలు. ఉద్దేశపూ ర్వక రుణ ఎగవేతదారుల జాబితాను ఆర్‌బీఐ సెంట్రల్‌ బ్యాంకింగ్‌ సిస్టం ‘సీఆర్‌ఐఎల్‌సీ’ ద్వారా విడుదల చేసింది. ఈ ఎగవేతదారుల్లో ఐదు కోట్ల కన్నా ఎక్కువ మొత్తాలను ఎగవేసిన వారి పేర్లే ఉన్నాయి. గత మూడేండ్లుగా సీఆర్‌ఐ ఎల్‌సీ ఎగవేతదారుల పేర్లు ప్రకటించటం మూలంగా, అప్పుల కోసం బ్యాంకుల దగ్గరికి వచ్చిన వారిలో ఎగవేతదారులను గుర్తించటం, బ్యాంకులను మోసం చేయకుండా నిలువరించటం సులు వైంది. 2019 ఫిబ్రవరి నుంచి బ్యాంకులు సీఆర్‌ఐఎల్‌సీ ద్వారా రుణం కోసం వచ్చేవారిలో సమస్యాత్మక, ఎగవేతదారులను గుర్తిస్తున్నారు.

అప్పు కట్టడానికి తగిన స్థోమత ఉన్నా కట్టకుండా బ్యాంకులను మోసం చేస్తున్నవారిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ఆర్‌బీఐ నిర్వచిస్తున్నది. అలాగే రుణగ్రహీలు తాము అప్పు తీసుకునేటప్పుడు ఆ సొమ్మును దేని కోసమైతే వినియోగిస్తామని చెబుతారో, దానికి కాకుండా ఆ నిధులను మరొక వైపు మళ్లించే వారిని కూడా ఆర్‌బీఐ విల్‌ఫుల్‌ డీఫాల్టర్స్‌గా ప్రకటిస్తున్నది.ఇలా ఉద్దేశపూర్వకంగా బ్యాంకు అప్పులను ఎగవేసిన వారిలో పేరుమోసిన కంపెనీలుండటం గమనార్హం. వాటిలో గీతాంజలి జెమ్స్‌, రోటోమాక్‌ గ్లోబల్‌, జూమ్‌ డెవలెపర్స్‌, డక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌, విన్‌సమ్‌ డైమండ్స్‌, ఆర్‌ఈఐ ఆగ్రో, సిద్ధివినాయక లాజిస్టిక్స్‌ అండ్‌ కుడోస్‌ చెమీ లాంటి ప్రముఖ కంపెనీలున్నాయి. ఈ కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్లు అందరూ సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర సంస్థలతో విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో కొందరి పేర్లు ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ ఉన్నకాలంలో ప్రధాని కార్యాలయానికి కూడా పంపటం జరిగింది. వారందరిపై సత్వర విచారణ, చర్యలు తీసుకోవాలని సీబీఐ, ఈడీ లాం టి కేంద్ర సంస్థలకు సూచించటం కూడా జరిగింది. అయినా ఇందులో కొన్నివాటిలో మాత్రమే విచారణ సంస్థలు ఒక కొలిక్కి వచ్చి ఆయా కం పెనీల ఆస్తులను జప్తు చేయటం జరిగింది. కానీ మెజారిటీ సంస్థలకు సంబంధించి వాటి అప్పులు, కారణాల విషయంలో ఇంకా విచారణ ప్రారంభం కాకపోవటం గమనార్హం.

ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుల పేర్లు వెల్లడించాలని ప్రజలు సమాచారహక్కు చట్టం సాయంతో బ్యాంకులను కోరిన ఫలితంగా ఇదం తా జరిగింది. అయినా ఇప్పటికీ ఆర్‌బీఐ ఎగవేతదారుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరు కనిపించటం లేదు. ఇంత జరిగినా అతి ఎక్కువ మొత్తంలో ఎగవేతదారులంటూ 30 మంది పేర్లనే ఆర్‌బీఐ ప్రకటించింది. నిరర్ధక ఆస్తుల విభాగంలో ఉన్నవాటి పేర్లనే ప్రకటించింది.


ఎగవేతదారుల లిస్టులో మరి కొన్ని ప్రముఖ కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఆ కంపెనీల ప్రమోటర్ల తరఫున జరిగిన తప్పు ఏమి టో స్పష్టత లేదు. అలాంటి వాటిలో ఏజీబీ షిప్‌యార్డ్‌, రుచిసోయా ఇం డస్ట్రీస్‌, హనుంగ్‌ టాయ్స్‌ అండ్‌ టెక్ట్స్‌టైల్స్‌, ఎస్‌ కుమార్స్‌, కెఎస్‌ ఆయి ల్స్‌ లిమిటెడ్‌ లాంటి కంపెనీలున్నాయి. ఐడీబీఐ బ్యాంకు రుచిసోయా కంపెనీని 2017 డిసెంబర్‌లో విల్‌ఫుల్‌ డీఫాల్టర్‌గా ప్రకటించింది. దీన్ని ఆ కంపెనీ యాజమాన్యం సవాల్‌ చేస్తూ న్యాయస్థానం మెట్లెక్కింది. ఐబీసీ క్రమంలో ఈ కంపెనీని పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ కంపెనీ కొనేసింది. ఈ నేపథ్యంలోనే 2018లో ఈ రుచిసోయా కంపెనీ కేంద్ర సంస్థల నిఘా నీడలో ఉన్నదని మీడియాలో వార్తలు వచ్చాయి. అందు లో డబ్బులు దుర్వినియోగం చేయబడ్డాయని ఆరోపించారు. మరోసారి 2018 జూన్‌లో కూడా ఆ కంపెనీలో పెద్ద ఎత్తున సింగపూర్‌ కంపెనీతో లావాదేవీల విషయంలో నిధుల గోల్‌మాల్‌ జరిగిందని వార్తలు వచ్చా యి. అలాగే ఏబీజీ షిప్‌యార్డ్‌ కూడా ఉద్దేశపూర్వక ఎగవేత కంపెనీగా ముద్రవేయబడింది. అలాగే ఖాతాలన్నీ కేంద్ర నిఘా సంస్థల పరిశీలన లో ఉన్నాయని కూడా మీడియాలో వచ్చింది. ఆ సమయంలో ఏబీజీ షిప్‌యార్డ్‌ కంపెనీ రుణదాతలకు 16 వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఆ కంపెనీని విల్‌ఫుల్‌ డీఫాల్టర్స్‌ లిస్టులో పెడుతూ..‘ కంపెనీ ప్రమోటర్లు దాని ఆర్థిక అవసరాలను తీర్చేవిధంగా వారు నడుపుతున్నారా అనేదాని కన్నా,

వారు సమర్థంగా ఆర్థిక, వ్యాపార ప్రమాణాలకు తగ్గటుగా నడుపుతున్నారా లేదా అన్నదానిపై కూడా ఆధారపడి ఎగవేతదారుల లిస్టులో చేరుస్తా’మని చెప్పటం జరిగింది. కాని కంపెనీ ఇప్పటి పరిస్థితి ఏమిటం టే దాన్ని అమ్మకానికి పెట్టినా దాన్ని కొనటానికి ఎవరూ ముందుకు రావ టం లేదు. ఎందుకంటే ఆ కంపెనీ నిర్వహణ తీరులో వ్యవహరించిన తీరు ప్రధాన అవరోధంగా మారింది. అలాగే హనుంగ్‌ టాయ్స్‌ అండ్‌ టెక్ట్స్‌టైల్స్‌ కంపెనీని 2018 మార్చిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 2,600 కోట్ల రూపాయలు ఎగవేసినందుకు గాను ఎగవేతదారుల లిస్టు లో చేర్చింది. కానీ బ్యాంకులో ఆర్థిక లావాదేవీల విషయంలో అక్రమా లు జరిగాయా అన్నది తేలలేదు కానీ ఈ కంపెనీ ప్రమోటర్‌ అశోక్‌కుమార్‌ బన్సాల్‌, అతని భార్యను నిర్బంధించారు. ఈ కోవలోనే ఎస్‌ కుమార్‌ నేషన్‌ వైడ్‌ కంపెనీ కూడా క్రమం తప్పకుండా అప్పులు చెల్లించటంలో వైఫల్యం చెందింది. ఈ కంపెనీ ఐదు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎగవేసిందని చెబుతూ దాన్ని విల్‌ఫుల్‌ డీఫాల్టర్స్‌ లిస్టులో చేర్చారు. ఈ క్రమంలోనే 2019 జూన్‌లో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఎస్‌.కుమార్‌ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. కానీ దాన్ని కొనేవారు కనిపించలేదు. ఈ కంపెనీ నిర్వహణ వ్యవహారంలో కూడా ఆర్థిక అరాచకం, గోల్‌మాల్‌ జరిగిందనటానికి రుజువులేమీ లభించలేదు.

2011లో ఆర్‌బీఐ నుంచి ఉద్దేశపూర్వక అప్పు ఎగవేతదారుల జాబి తా కావాలని స.హ.చట్టం కింద అడిగిన విన్నపాలు సెంట్రల్‌ ఇన్ఫర్మేష న్‌ కమిషన్‌ (సీఐసీ) చెంతకు చేరాయి. దీంతో సీఐసీ కమిషనర్‌ శైలేష్‌ గాంధీ ఎగవేతదారుల జాబితా వెల్లడించాలని ఆర్‌బీఐని ఆదేశించారు. ఈ క్రమంలో ఎగవేతదారుల పేర్లు ప్రకటించినంత మాత్రాన బ్యాంకులు విశ్వసనీయతను కోల్పోతాయని, ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడుతుంద న్నదాన్ని తోసిపుచ్చారు. దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం జరుగనంత వరకు ఎగవేతదారుల పేర్లు ప్రకటించవచ్చని తేల్చిచెప్పారు. ఈ ఎగవేతదారుల పేర్లు వెల్లడించటం అనేది దేశ నైతిక విలువల పరిరక్షణకు భంగం కలిగించకుండా దేశ ప్రయోజనాలను కాపాడేదిగా ఉండాలని గాంధీ అన్నా రు. ఎగవేతదారుల పేర్లు వెల్లడించినంత మాత్రాన దేశంలోని బ్యాంకు ఖాతాదారుల విశ్వాసం కోల్పోతామన్నది సరికాదని గాంధీ తన ఆదేశం లో వెల్లడించారు. ఈ క్రమంలో ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించటంతో కోర్టు స్టే ఇచ్చింది.

ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుల పేర్లు వెల్లడించాలని ప్రజలు సమాచారహక్కు చట్టం సాయంతో బ్యాంకులను కోరిన ఫలితంగా ఇదం తా జరిగింది. అయినా ఇప్పటికీ ఆర్‌బీఐ ఎగవేతదారుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరు కనిపించటం లేదు. ఇంత జరిగినా అతి ఎక్కువ మొత్తంలో ఎగవేతదారులంటూ 30 మంది పేర్లనే ఆర్‌బీఐ ప్రకటించింది. నిరర్ధక ఆస్తుల విభాగంలో ఉన్నవాటి పేర్లనే ప్రకటించిం ది. మరికొన్నింటి విషయంలో ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఇ) ప్రకా రం ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రత్యేక ఖాతాదారుల పేర్లు వెల్లడించలేమని చెబుతున్నది. అలాగే జయంతిలాల్‌ మిస్ట్రీ తీర్పులోని 77 పేరాలో చెప్పి నవిధంగా ప్రత్యేకమైన సమాచారాన్ని చెప్పకుండా దాచి ఉంచవచ్చన్నదానికి అనుగుణంగా చెప్పటానికి నిరాకరిస్తుండటం గమనార్హం.
(‘ది వైర్‌' సౌజన్యంతో..)

కబీర్‌ అగర్వాల్‌
అనుజ్‌ శ్రీనివాస్‌

611
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles