బీజేపీ గుట్టు రట్టవుతుందా?


Sun,December 1, 2019 12:39 AM

ఎన్డీయే భాగస్వామిగా శివసేన ముఖ్యమంత్రి పదవి చేపట్టడాన్ని అమిత్ షా ఎందుకంత బలంగా వ్యతిరేకిస్తున్నారనేది ఆలోచించవలసిన విషయం. ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉందని భయపడుతున్నారా? న్యాయమూర్తి బి.హెచ్.లోయ అనుమానాస్పద మరణం విషయంలో ఫడ్నవీస్ ప్రభుత్వం పోలీసులను కిందిస్థాయి న్యాయస్థానాన్ని ఉపయోగించుకున్నదనే అనుమానాలున్నాయి. దీనిని శివసేన 2018 జనవరిలో లేవనెత్తింది. సోహ్రబుద్దీన్ కేసు ఉండనే ఉన్నది. సమాచార హక్కు ఉద్యమకారుడు సతీష్ శెట్టి హత్య కేసు ఒకటి వివాదాస్పదమైంది. హిందుత్వ పేర సాగిస్తున్న కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు శివసేనతో సంబంధం లేదు. కానీ కొన్ని మత సంస్థలతో వాటికి సంబంధం ఉన్నది. పీఎంసీ బ్యాంక్ కుంభకోణాన్ని బీజేపీ కప్పిపెడుతున్నది.

siddartha-varada-rajan
ప్రధాని మోదీ, హోం మం త్రి చేతలపై వెలుగు ప్రసరించగలిగితే అమిత్ షా శివసేన-ఎన్సీపీ-కాం గ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడటం భారత రాజకీయాల్లో మూల మలుపు. వీరిరువురు ఎన్నో తప్పిదాలు చేసిన క్రమంలో నిర్లక్ష్యంగా ఒక పెద్ద పొరపా టు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల కోసం వారు రాష్ట్రపతిని వినియోగించుకున్నారు. క్యాబినెట్‌ను వాడుకున్నారు. అవినీతి కేసులను కూడా ఉపయోగించుకున్నారు. మీడియాను కూడా సాధనంగా వాడుకున్నారు. దొంగచాటుగా జరిగిన ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం ప్రసారాన్ని దూరదర్శన్‌కు కాకుండా ఎఎన్‌ఐ వార్తాసం స్థకు అప్పగించారు. కానీ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని చూసుకోవాలనేది మరిచిపోయారు.

ఈ ఆధునిక చాణక్యులు మొత్తం రాజనీతిశాస్త్రం, ద్యవ్య ఆర్థికశాస్త్రం, చట్టం, ప్లాస్టిక్‌సర్జరీ, జ్యోతిశ్శాస్త్రం మొదలైన వాటిలో నిష్ణాతులు కావచ్చు. ఆర్యభట్ట వారసులుగా చెప్పుకున్నప్పటికీ, వారికి గణితశాస్త్రం ఒంటబట్టినట్టు లేదు. కానీ రసవత్తర నాటకం పేలవంగా ముగిసింది. 24 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించినప్పుడు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తనకు మెజారిటీ లేదని ఆయనకు ముందే తెలుసు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన కూటమి తరఫున శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకా రం చేశారు. మోదీ షా ఎక్కడ పొరపాటు పడ్డారు. మహారాష్ట్ర పరిణామాలు బీజేపీకి, ప్రతిపక్షానికే కాదు, ప్రజాస్వామ్యం నిలవాలని కోరుకునే వారందరికి ఈ పరిణామాలు గుణపాఠాల వంటివి. దేశ రాజకీయాల్లో మహారాష్ట్ర పరిణామం మూలమలుపు వంటిది.

దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సందర్భంగా మాట్లాడుతూ శివనసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ అవకాశవాద పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. కానీ బీజేపీని వ్యతిరేకించేవారు మాత్రం ఫడ్నవీస్ శివసేనతో బెడిసికొట్టిన తర్వాత ఎన్సీపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ప్రయత్నించారని గుర్తుచేస్తున్నారు. ఏ పార్టీపై పోటీచేశారో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడమేమి టి? ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఇటువంటి కూటములు ఏర్పాటుకావడం సాధారణమే. అటువంటి కూటములు ఏర్పాటుకా వాలె కూడా. అయితే ఈ కూటమి ఎటువంటిదై ఉంటుందనేదే ప్రధానం. భిన్న సిద్ధాంతాలు గల పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కూటమిగా ఏర్పడటం చాలా కష్టం. చర్చలు జరుపడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. 2017 ఎన్నికల తర్వాత జర్మనీ లో కూటమి కట్టడం ఎంత కష్టమంది! మహారాష్ట్రలో నాలుగు పెద్ద పార్టీలు ఆవిర్భవించాయి. దేనికీ మెజారిటీ లేదు. అటువంటప్పుడు కూటమి ఏర్పాటు తప్పనిసరి.

మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలను ఏకతాటిపైకి తేవడానికి శరద్ పవార్ చాలా కష్టపడ్డారు. అయితే ఆయన ఈ ప్రయత్నాలను బహిరంగంగా చేశారే తప్ప రహస్యంగా కాదు. వైరుధ్యాలతో కూడిన పార్టీలు ఏకం కావడాన్ని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకున్నాయి. ఆయా పార్టీల సొంత ఎజెండాలతో పాటు మహారాష్ట్ర ప్రజలకు అవసరమైన ఉమ్మడి ప్రణాళిక అందులో ఉన్నది. కానీ నరేంద్ర మోదీ, అమిత్ షా వ్యవహారసరళి ఇందుకు భిన్నంగా సాగింది. వారు చేసిన ప్రయత్నాలన్నీ రహస్యమైనవే. వారు ఎన్సీపీ నాయకులతో, ప్రత్యేకించి శరద్ పవార్‌తో బహిరంగంగా చర్చలకు రావలిసింది. 2014లో ఎన్సీపీ బీజేపీకి మద్దతు ప్రకటించలేదా! ఎన్సీపీతో ఉమ్మడి కార్యక్రమంపై చర్చించవలసింది. 2015లో బీజేపీ పీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చర్చించినట్టే ఇప్పుడు కూడా చేయాల్సింది. కానీ మోదీ, షా ఆ విధంగా వ్యవహరించాలని అనుకోలేదు.

అజిత్ పవార్ తమ పార్టీని, కుటుం బ సంబంధాలను తెంపుకొని ఫడ్నవీస్‌కు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి బెదిరింపులు, ఒత్తిడులు వచ్చాయో దేవుడికే తెలువాలె. ఆయనపై ఉన్న అవినీతి కేసులను ఉపయోగించి ఉంటారు. ఫడ్నవీస్‌కు ఎన్సీపీ మద్దతు ఇస్తున్నట్టుగా ఉండే పత్రాల ను అజిత్ పవార్ లోపాయికారిగా సంపాదించాడు. పత్రాలు ఇచ్చినంత మాత్రాన మద్దతు రాదని ఆయనకు తెలిసే ఉంటుంది. కానీ రెండువారాల గడువులోగా ఎమ్మెల్యేలను జమచేస్తామని బీజేపీ నాయకులు ధీమాగా చెప్పి ఉంటారు. చివరకు శరద్‌పవార్ చతురత, సంప్రదాయాన్ని కాదనడానికి సుప్రీంకోర్టు విముఖత మూలంగా ఈ మహారాష్ట్రలో సాగిన కుట్ర సాగలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ కూటమి సంకీర్ణ ధర్మం ప్రకారం నడుచుకోవలసి ఉన్నది.

మహారాష్ట్ర అధికార కూటమి ఏదోవిధంగా కూలిపోతుందని మోదీ- అమిత్ షా ఆశపడుతున్నారు. వారిలో విభేదాలు తలెత్తి కూలిపోవచ్చుననేది ఒక ఆశ. బీజేపీ వారిలో ముసలం పుట్టించి తమవైపు కొందరిని ఆకర్షించుకునే ప్రయత్నం చేయవ చ్చు. కర్ణాటకలో మాదిరిగా సీబీఐ, ఈడీ వంటి సంస్థల చేత బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి కూల్చివేయవచ్చు. తక్షణ అధికార కాంక్షను తీర్చుకోవడానికే శివసేన ఎన్డీయే నుంచి బయటకువచ్చిందనేది తెలిసిందే. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న కూటమి నుంచి కూడా వైదొలగవచ్చు. ఒక అభిప్రాయం ప్రకారం.. శివసేన రెండు పులుల మీద సవారీ చేస్తున్నది. హిందు వాదం, మహారాష్ట్ర ప్రాంతీయవాదం. హిందుత్వ వల్ల వచ్చే ప్రయోజనాలు తీరా యి. ట్రిపుల్ తలాఖ్, అయోధ్య, 370 అధికరణం వల్ల ఇక రాజకీయ ప్రయోజనాలుండవు.

ఇంకా ఒకటీ అర నినాదాలు ఉండవచ్చు. కానీ అవి ఉపయోగకరమైనవి కాదు. ఇక రెండవ అంశం. బీజేపీ తనను నిర్మూలించదలుచుకున్నదనేది శివసేనకు తెలుసు. ఈ లక్ష్యం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది. ఇక డ్రైవర్ సీట్లో కూర్చుంటే తప్ప తననుతాను రక్షించుకోలేదని భావించింది. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే ఫలితాలు ఎట్లా ఉంటాయోననే భయం శివసేనకు ఉండేది. కానీ అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ గవర్నర్‌నే కాదు, రాష్ట్రపతి పదవిని ఉపయోగించుకున్న తీరు గమనించిన తర్వాత ఇక శివసేన వెనక్కుపోయే అవకాశం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మహావికాస్ అఘాడీ కలిసి పోటీ చేస్తుందని భావించవచ్చు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గనుక ఓడిపోకపోతే భయానకంగా ప్రతీ కారం తీర్చుకుంటుందనేది శివసేనకు తెలుసు. మోదీ-షా చావోరేవో అనే పరిస్థితి ని సృష్టించారు కనుకనే శివసేనతో పాటు ఇతరపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి.

ఎన్డీయే భాగస్వామిగా శివసేన ముఖ్యమంత్రి పదవి చేపట్టడాన్ని అమిత్ షా ఎందుకంత బలంగా వ్యతిరేకిస్తున్నారనేది ఆలోచించవలసిన విషయం. ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉందని భయపడుతున్నారా? న్యాయమూర్తి బి.హెచ్.లోయ అనుమానాస్పద మరణం విషయంలో ఫడ్నవీస్ ప్రభుత్వం పోలీసులను కిందిస్థాయి న్యాయస్థానాన్ని ఉపయోగించుకున్నదనే అనుమానాలున్నాయి. దీనిని శివసేన 2018 జనవరిలో లేవనెత్తింది. సోహ్రబుద్దీన్ కేసు ఉండనే ఉన్నది. సమాచార హక్కు ఉద్యమకారుడు సతీష్ శెట్టి హత్య కేసు ఒకటి వివాదాస్పదమైంది. హిందుత్వ పేర సాగిస్తున్న కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు శివసేనతో సంబంధం లేదు. కానీ కొన్ని మత సంస్థలతో వాటికి సంబంధం ఉన్నది. పీఎంసీ బ్యాంక్ కుంభకోణాన్ని బీజేపీ కప్పిపెడుతున్నది. ఎన్నికల ప్రచార నిధులపై వివాదం ఉన్నది. భీమా కోరెగాంవ్ వివాదం విస్తృతమైనది. దళిత, ట్రేడ్‌యూనియన్ కార్యకర్తపైన, న్యాయవాదులపై బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్రపన్నారనే పెద్ద కేసు పెట్టడం గమనార్హం.

ఈ తప్పుడు కేసును ఆధారంగా చేసుకొని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టానికి భయానకమైన సవరణలను తేవడంపై అమిత్ షా ఆసక్తి చూపారు. ఇప్పుడు మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ చేతినుంచి అధికారం జారిపోయింది. ఈ వ్యవహారాలన్నీ ఇక బట్టబయలు కావచ్చు. శివసేనకు, ఇతరపక్షాలకు ఇప్పుడు బీజేపీతో గొడ వ పడినందువల్ల పోయేదేమీ లేదు. ఈ కూటమి బీజేపీ గట్టును రట్టు చేయవచ్చు.
(వ్యాసకర్త: ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు. ఈ ఏటి పాత్రికేయుడుగా రామనాథ్ గోయెంకా అవార్డు పొందారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం బోధించారు. అమెరికాలోని బర్క్‌లీ విశ్వవిద్యాలయంలో జర్నలిజం బోధించారు. శివనాడార్ విశ్వవిద్యాలయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్, క్రిటికల్ థియరీ కేంద్రంలో పనిచేశారు. ది హిందు పత్రిక సంపాదకుడిగా పనిచేశారు)
ది వైర్ సౌజన్యం...

832
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles