జనాభా లెక్కల సీజన్


Sat,November 30, 2019 10:39 PM

1992 నవంబర్‌లో ఇంద్రసహాని కేసులో ఓబీసీ రిజర్వేషన్ల గురించి సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆయా రాష్ర్టాల్లో, కేంద్రంలో బీసీలను, ఓబీసీలను గుర్తించడానికి లిస్టులో చేర్చడానికి, తొలిగించడానికి వారికి తగు ప్రణాళికలు, పథకాలు రూపొందించడానికి సిఫార్సులు చేయడానికి శాశ్వత ప్రాతిప దికపై నేషనల్ బీసీ కమిషన్, రాష్ర్టాల బీసీ కమిషన్‌లు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అలా 1993 నుంచి నేషనల్ బీసీ కమిషన్, ఆయా రాష్ర్టాల బీసీ కమిషన్లు శాశ్వత ప్రాతిపదికపై కొనసాగుతున్నాయి.

ramulu-bs
2021లో ప్రారంభమయ్యే జనాభా లెక్కల సీజన్ తాలూకు ఏర్పాట్లు, శిక్షణలు మొదలయ్యాయి. 2011 జనా భా లెక్కలు తీసినప్పటికీ ఇప్పటికీ వాటి వివరాలు, విశ్లేషణలు ప్రజలకు అందుబాటులోకి రాలే దు. జనాభా లెక్కలు తీయడం ద్వారా అనేక వివరాలు సేకరించడం జరుగుతుంది. తద్వారా ఎంత జనాభా, ఏయే సామాజికవర్గాలు, ప్రజల జీవన ప్రమాణాలు, జాతీయాభివృద్ధి, వృద్ధులు, పిల్లలు, యువకులు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు మొదలైన వివరాలు, జీవనస్థితిగతులు తెలుస్తాయి. అభివృద్ధి, సం క్షేమం, ఆధునిక విద్య, నైపుణ్యాలు ఎవరెవరికి ఎంతమేరకు అందుతున్నాయో, ఎలాంటి ప్రణాళికలు, పథకాలు చేపట్టాలో, ఎలా ముందుకుసాగాలో, ఎలా ముందుకు సాగుతున్నదో తెలుస్తుంది. 1931లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఇండియాలో కులాలవారీగా చేపట్టిన జనాభా లెక్కలు కొన్ని సామాజికవర్గాలకు ఇప్పటికీ ఆధారభూతమవుతున్నాయి. సామాజికవర్గాల వారీగా, మతాలవారీగా, తమ ప్రాతినిధ్యం ఉండాలని, ముస్లింలు, సిక్కులు, బ్రాహ్మణులు, అంటరానివారు కోరుతూ, 1919 నాటి రాజ్యాంగాన్ని, హక్కులను విస్తరించాలని కోరింది. అందుకు స్పందించిన బ్రిటిషు ప్రభుత్వం అధ్యయనం చేసి నివేదిక అందించాలని సైమన్ కమిషన్‌ను నియమించింది.

ఇండియాలో సైమన్ కమిషన్ పర్యటించినప్పుడు సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ గాంధీజీ నాయకత్వం ఆందోళన చేపట్టింది. అనేక సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా ప్రాతినిధ్యం కల్పించడం, గుర్తించడాన్నివారు వ్యతిరేకించారు. తమకు ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని కోరేవాళ్లు సైమన్ కమిషన్ కు విజ్ఞప్తులు సమర్పించారు. ఇంగ్లాండ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. బి.ఆర్.అంబేద్కర్ సైమన్ కమిషన్‌కు అంటరానివాళ్ళ (డిప్రెస్డ్ క్లాసెస్) దుస్థితి గురించి నివేదించారు. సైమన్ కమిషన్ దానిపై కమ్యూనల్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డులో సిక్కులు, ముస్లింలు, ఎస్సీలు, మొదలైనవారికి ప్రజాప్రాతినిధ్యం సిఫార్సు చేసింది. వాటి ని వ్యతిరేకిస్తూ, గాంధీజీ ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో ఒప్పందం చేసుకున్నది. అదే 1932 అక్టోబర్‌లో జరిగిన పూనా ఒప్పందం. ఆ ఒప్పందాన్ని అనుసరించి 1935 భారత రాజ్యాంగంలో అంటరానివారికి రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడినాయి. అవి ఆ తర్వాత 1949 నవంబర్ 26న ఆమోదించి 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో పొందుపరచబడి నేటికి కొనసాగుతున్నాయి.

ఓబీసీలు, బీసీల గురించి జనాభా లెక్కలు తీయాలని, వారికి చట్టసభల తో పాటు అన్నిరంగాల్లో ప్రజా ప్రాతినిధ్యం, జనాభా దామాషా మేరకు కల్పించాలని, ఆయా సామాజికవర్గాలు చాలాకాలంగా కోరుతూ వస్తున్నా యి. ముఖ్యంగా 1978లో ప్రధాని మొరార్జీ దేశాయ్ కాలంలో 1978లో బి.పి.మండల్ ఛైర్మన్‌గా బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. మండల్ కమిషన్ 1980లో తన నివేదికను అందజేసింది. ఆ నివేదిక దేశవ్యాప్తంగా బీసీలు 46-56 శాతం దాకా ఉన్నారని అనేక రిసోర్స్‌ల ద్వారా, నమూనా సర్వేల ద్వారా నిర్ధారించింది. చట్టసభల్లో, విద్య, ఉద్యోగ, పారిశ్రామికరంగాల్లో రిజర్వేషన్లను, ప్రజా ప్రాతినిధ్యాన్ని ఆ నివేదికలో సిఫార్సు చేసింది. ఆ నివేదికను అందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది.1989లో ప్రధాని వీపీ సింగ్ దాన్ని దులిపి కొన్నిరంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలుజరుపాలని, ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని వ్యతిరేకి స్తూ ఇతర సామాజికవర్గాల న్యాయస్థానాలను ఆశ్రయించారు.

అనేక వాదోపవాదాల తర్వాత సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. 1992 నవంబర్‌లో వెలువరించిన ఆ తీర్పు ఇంద్రసహాని కేసులో తీర్పు అనే పేరిట ప్రాచుర్యం పొందింది. సుప్రీంకోర్టు ఆ తీర్పులో రిజర్వేషన్లను అమలుజరుపాల్సిందేనని, అయితే అన్ని రిజర్వేషన్లు కలిపి యాభై శాతం మించకూడద ని అభిప్రాయపడింది. అందువల్ల ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతానికి పరిమితం చేసింది. 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే అందుకు జనాభా లెక్కలను ప్రాతిపదికగా, శాస్త్రీయంగా చూపాలని పేర్కొన్నది. ఆ ప్రకారంగా తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు, ఈశాన్య రాష్ర్టాల్లో కొన్నిచోట్ల 80 శాతం దాకా రిజర్వేషన్లు అమలుజరుపుతున్నారు. జనాభా లెక్కలు శాస్త్రీయంగా లేవు కాబట్టి రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.కె.మురళీధర్‌రావు కమిషన్ 1984లో ప్రతిపాదించిన సిఫార్సులను అనుసరించి ఎన్టీఆర్ బీసీలకు మొత్తం కలిపి 44 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు హైకోర్టు కొట్టివేసింది. ఇలా ఆయా రాష్ర్టాల్లో బీసీల కోసం పెం చిన రిజర్వేషన్లను, జనాభా లెక్కలు లేవని, న్యాయస్థానాలు కొట్టివేస్తూ వస్తున్నాయి.

అందువల్ల అన్నిటికి 1931 నాటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతున్నది. 1931లో కూడా ఆయా సామాజకవర్గాలకు న్యాయం చేయడానికి ఆ లెక్కలు తీయడం జరిగింది. బి.పి.మండల్ కమిషన్ సిఫార్సుల తర్వాత వాటిని అమలుచేయడానికి జనాభా లెక్కలను శాస్త్రీయంగా చూపించడానికి జనాభా లెక్కల్లో కులాలవారీగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వారీగా కచ్చితంగా, నిర్దిష్టంగా జనాభా లెక్కలు తీయాల్సిన అనివార్యత ఏర్పడింది. అందుకోసం అనేక పార్టీలు, సామాజిక ఉద్యమాలు 1991లో తీసే జనాభా లెక్కను కులాలవారీగా, సామాజికవర్గాల వారీగా తీయాలని కోరింది. అలా 2001లో, 2011 లో కూడా బలంగా కోరుతూ రావడం జరిగింది. ప్రజల ఒత్తిడిని ఆయా పార్టీల తీరును గమనించి 2011లో బీసీల, ఓబీసీల జనాభా లెక్కలను తీయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అందుకు ప్రత్యేకంగా ఒక ఫార్మాట్‌ను రూపొందించింది. అలా తీసిన జనాభా లెక్కలు ఏమయ్యాయో ప్రభుత్వాలు ఇప్పటివరకు చెప్పడం లేదు. ఆ లెక్కలు సరిగ్గా తీశారో లేదో కూడా తెలియదు. ఏండ్లు గడిచిపోతున్నాయి. కాలయాపన జరిగిపోతున్నది. 1932లో పూనా ఒప్పందం ద్వారా షెడ్యూల్డ్ కులాలకు అమలులోకి వచ్చి న రిజర్వేషన్ల కాలం నుంచే అమలుచేయాల్సిన బీసీ రిజర్వేషన్లు నేటికీ అమల్లోకి రావడం లేదు. అందుకు జనాభా లెక్కలు లేకపోవడం ప్రధాన కారణమని న్యాయస్థానాలు, ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. 1948లో చేసిన చట్టాలను అనుసరించి జనాభా లెక్కల కమిషన్ మాత్రమే జనాభా లెక్కలు తీయాలి. అందువల్ల తమ అవసరాల కోసం జనాభా లెక్కలు తీయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబాల సర్వే మొదలైన వివిధ పద్ధతులను అనుసరిస్తున్నారు.

1992 నవంబర్‌లో ఇంద్రసహాని కేసులో ఓబీసీ రిజర్వేషన్ల గురించి సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆయా రాష్ర్టాల్లో, కేంద్రంలో బీసీలను, ఓబీసీలను గుర్తించడానికి లిస్టులో చేర్చడానికి, తొలిగించడానికి వారికి తగు ప్రణాళిక లు, పథకాలు రూపొందించడానికి సిఫార్సులు చేయడానికి శాశ్వత ప్రాతిప దికపై నేషనల్ బీసీ కమిషన్, రాష్ర్టాల బీసీ కమిషన్‌లు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అలా 1993 నుంచి నేషనల్ బీసీ కమిషన్, ఆయా రాష్ర్టాల బీసీ కమిషన్లు శాశ్వత ప్రాతిపదికపై కొనసాగుతున్నాయి. బీసీ కమిషన్‌లు ఏ సిఫార్సులు చేయాలన్నా జనాభా లెక్కలు, ఆయా ప్రజల జీవనస్థితిగతు లు, విద్య, ఉద్యోగ, సామాజికస్థాయి జీవన ప్రమాణాలు, ఆధునిక అభివృద్ధి అందుకుంటున్న తీరు, అందుకోలేకపోతున్న తీరు ఉద్యోగాల్లో వారి శాతం మొదలైన లెక్కలు ప్రతిసారి తీయాల్సి వస్తున్నది. ప్రతిసారి కోట్ల రూపాయ లు, వేలాదిమంది ఉద్యోగులు, వలంటీర్లు అందుకు నియమించబడి లెక్క లు తీయాల్సి వస్తున్నది.

ఉదాహరణకు కర్నాటకలో మూ డుకోట్ల ముప్ఫై ఐదు లక్షల కుటుంబాల సర్వేను హెచ్.కాంతరాజ కమిషన్ నాయకత్వంలో శాస్త్రీయంగా చేపట్టి నివేది క రూపొందించారు. దాన్ని ప్రభుత్వం తీసుకోలేదు. జనాభా లెక్కల ఆవశ్యకత అనేకరంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడానికి, సమాజ వికాసానికి, ప్రణాళికలు చేపట్టడానికి, ప్రభుత్వాలకు, ప్లానింగ్ కమిషన్‌కు ఎంతో అవసరం. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాధాన్యాన్ని గుర్తించి సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఆ వివరాలను అనుసరించి తెలంగాణలో ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు 10 శాతం, ముస్లింలు 12 శాతం, బీసీలు 50-52 శాతం అని, మొత్తంగా 85-89 శాతం దాకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెప్తూ వచ్చారు. అనేక అవసరాల రీత్యా, దేశాభివృద్ధిరీత్యా 2021లో జనాభా లెక్కల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీల వలె ఓబీసీ, బీసీల కులాల వారీ లెక్కలను, ముస్లింలలోని కులవృత్తుల వారీ లెక్కలను, క్రైస్తవుల్లోని కులాలవారీ లెక్కలను కూడా తీయడం ఎంతో అవసరం. చైనాతో పోటీపడి ఎదుగడానికి అన్నిరంగాల్లో నైపుణ్యా లు, సంపద ఉత్పత్తి పెరుగడానికి ఈ జనాభా వివరాలు సేకరించడం ఎంతగానో ఉపయోగపడుతాయి.

597
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles