రక్షణలు సరే, పోటీతత్వం ఏది?


Thu,November 7, 2019 11:17 PM

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్.టి.ఏ.)లో భాగంగా మిగతా దేశాల నుంచి పెరుగుతున్న దిగుమతులు దేశంలోకి వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ తరుణంలో భారత్ వాటిని అడ్డుకోవటం కోసం సుంకాలను పెంచటానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఆ క్రమంలో వర్తక వాణిజ్యంలో భారత్ తన వాటాను పెంచుకోవటంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎగుమతులు పెంచుకోవాలన్న కలలన్నీ కల్లలైనాయి.

ప్రాంతీయ సమగ్ర భాగస్వామ్య ఒప్పందం నుంచి భారత్ తప్పుకున్న పరిస్థితుల్లో అన్నివైపుల నుంచి విమర్శనాత్మక విశ్లేషణలు వస్తున్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం.. తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతుల అవకాశాలను చేజార్చుకున్నట్లు అయ్యింది. అలాగే ఆర్సీఈపీ భాగస్వామ్య దేశాలు ఇచ్చే స్థానిక ప్రయోజనకర ఆర్థిక వనరులను కోల్పోయినట్లు అయ్యిందన్న వాదనలూ ఉన్నాయి. స్వేచ్ఛామార్కెట్ విధానాల ఫలితంగా కొరియా, జపాన్ దేశాల మార్కెట్ పోటీని తట్టుకు నేవిధంగా ఉత్పత్తి నాణ్యతను పెంచుకోవటానికి చొరవ చూపటంలో వెనుకబడటం దీర్ఘకాలికంగా నష్టదాయకం అంటున్నారు.

RCEP-dairy11
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సీఈ పీ)పై సంతకం చేయటానికి భారత్ ఒప్పుకోకపోవ టం ప్రాంతీయ భాగస్వామ్యశక్తుల ప్రయోజనాలను చాటిచెప్పినట్లయ్యింది. తూర్పు ఆసియాలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగి న 16 దేశాల కూటమి ఆర్సీఈపీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి, అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు కలిగి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆర్సీఈపీ కార్యరూపంలోకి రాకపోవటమనేది ప్రాంతీయశక్తుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నది. స్వాతంత్య్రం తర్వాత ఒక విషయంపై దేశంలోని అన్నివర్గా లు ఏకాభిప్రాయం వ్యక్తంచేసిన విషయంగా ఆర్సీఈపీని తిరస్కరించడా న్ని చెప్పుకోవచ్చు. ఆర్సీఈపీ మూలంగా దేశానికి నష్టం వాటిళ్లుతుందని రైతులు, కార్మికసంఘాలు మొదలు పౌర సంఘాలు, పారిశ్రామికవర్గాలు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తంచేశాయి. ఆర్సీఈపీపై సంతకం చేస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నివర్గాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేయటం గమనార్హం.

మరో మాటలో చెప్పాలంటే ఇప్పటికే మందగమనంతో తంటాలు పడుతున్న భారత ఆర్థికవ్యవస్థ ఆర్సీఈపీతో మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ముఖ్యం గా పారిశ్రామిక ఉత్పత్తిరంగం కోతలు విధిస్తూ కుంటుతూ నడుస్తున్న తరుణంలో వ్యవసాయ రంగం కూడా తీవ్ర పోటీని ఎదుర్కొనే క్రమం లో సంక్షోభ పరిస్థితిని అధిగమించాల్సిన స్థితి ఏర్పడుతుంది. 2012లో నే ఆర్సీఈపీ ముందుకు వచ్చినప్పుడు భారత్ తనవైన కారణాలను కూటమి ముందు ఉంచింది. ఆ క్రమంలోనే మూడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఆసియన్ దేశాల నుంచి ముందుకువచ్చినప్పు డు కూడా భారత్ ఇవే కారణాలను కొరియా, జపాన్ దేశాల ముందు ఉంచింది. ఆ క్రమంలోనే అనేక రైతుసంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛామార్కెట్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏదేమై నా ప్రాంతీయంగా తమ ఉత్పత్తుల నాణ్యతతో మార్కెట్లో పోటీపడాల్సి న ఆవశ్యకత ఉన్నది.

అయితే వర్తమాన ప్రపంచ పరిస్థితుల్లో స్వేచ్ఛామార్కెట్ విధానాలతో భారత్ లబ్ధిపొందటంలో విఫలమైంది. ఆశించిన దానికన్నా ఎగుమతు లు పెంచుకోవటంలో వైఫల్యం చెందింది. ఎఫ్‌టీఏలో భాగంగా మిగతా దేశాల నుంచి పెరుగుతున్న దిగుమతులు దేశంలోకి వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ తరుణంలో భారత్ వాటిని అడ్డుకోవటం కోసం సుం కాలను పెంచటానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఆ క్రమంలో వర్తక వాణిజ్యం లో భారత్ తన వాటాను పెంచుకోవటంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎగుమతులు పెంచుకోవాలన్న కలలన్నీ కల్లలైనాయి.

ఈ వాస్తవ పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకున్న భారత్ ఆర్సీఈపీ చర్చల్లో చురుకుగా భాగస్వామ్యమవుతూనే, దేశ ప్రయోజనాలకు భం గం కలుగకుండా జాగ్రత్తపడింది. ఆర్సీఈపీ భాగస్వామ్య దేశాలు వెచ్చిస్తున్న పెట్టుబడితో తలెత్తే పరిణామాలను అధ్యయనం చేసింది. ఆ నేపథ్యంలోంచే పెట్టుబడి మూలంగా వచ్చే విపరిణామాలను ఎదుర్కోవటం అత్యవసరమైంది. ముఖ్యంగా స్వేచ్ఛా మార్కెట్ విధానాల కారణంగా ఏసియన్ కూటమి దేశాలు కొరియా, జపాన్ దేశాల నుంచి వచ్చే మార్కె ట్ పోటీని తట్టుకోవటం ఎలా అనేది పెద్ద సమస్య. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ఉత్పత్తుల నుంచి భారత్ మార్కెట్‌ను సంరక్షించుకోవటం సుంకాల పెంపుతో సాధ్యమవుతుందా అన్నది దుర్లభమే. స్వేచ్ఛా మార్కె ట్ విధానాలు ఉన్నదున్నట్లు అమల్లోకి వస్తే మొత్తంగా చైనానే మార్కెట్ ను ఆక్రమించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్రమంలోంచే భారత్ ఆర్సీఈపీ భాగస్వామ్య దేశాల కూటమితో చాలా జాగరూకతతో వ్యవహరిస్తున్నది. పెట్టుబడి వెచ్చిస్తున్న వారి హక్కులను పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్న ది. ఆర్సీఈపీపై సంతకం చేసి, దానిలో భాగస్వామ్య దేశంగా మారితే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల చర్చల్లో అంతర్జాతీయంగా, జాతీయంగా అనేకవిధాలుగా ఆత్మరక్షణలో పడే ప్రమాదం ఉన్నది.

ఇలాంటి ఓ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోంచే భారత్ ఆర్సీఈపీలో భాగస్వామ్యం కావటంలోంచి వైదొలిగింది. మొదటగా ఆర్సీఈపీ లక్ష్యం గా చెప్పుకున్న అనేక అంశాలను కూలంకషంగా చర్చింది. ఆ క్రమంలో ఆర్సీఈపీలో భాగస్వామ్యపక్షంగా చేరే క్రమంలో తలెత్తే సమస్యలను భాగస్వామ్యపక్షాలకు వివరించింది. రెండో అంశంగా ప్రతి సందర్భంలోనూ ఆయా అంశాలపై అన్నిదేశాలతో తన అభిప్రాయాలను పంచుకున్నది. అలాగే మార్కెట్‌లో వివిధ దేశాల వస్తు భాగస్వామ్యాలపై కూడా సవివరంగా చర్చించింది. ఇదంతా ఒక నిర్ణయానికి వచ్చే ముం దు ప్రజాస్వామ్య యుతంగా అన్నివిధాలా చర్చలకు తావిచ్చింది. అదే క్రమంలో దేశ ఆర్థికవ్యవస్థ, స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఆయా దేశాలతో భారత ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఉండే విషయాలపై చర్చలు చేసింది.

ఆర్సీఈపీ చర్చల్లో తుది ఫలితాలపై భారత్ తీక్షణం గా కన్నేసింది. వాటిలోని అంశాలను అన్నికోణాల నుంచి అధ్యయనం చేసింది. ఆ అంశాలను ప్రజాక్షేత్రంలో చర్చనీయాంశాలుగా చేసి ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నది. ఆ నేపథ్యంలోంచే ఆసియన్ దేశాలు కొరియా, జపాన్ దేశాల మార్కెట్ విధానాలను పరిశీలించింది. అలాగే స్వేచ్ఛామార్కెట్ విధానాలతో ఆర్సీఈపీ దేశాల భాగస్వామ్య ఒప్పందంతో భారత్‌కు ఒనగూడే వ్యతిరేక ప్రభావాలు, ఫలితాలను అధ్యయనం చేసింది.
స్వేచ్ఛామార్కెట్ వాణిజ్య విధానాలతో భారత్ తన ప్రయోజనాలను ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల పరిరక్షణకు పెద్దపీట వేసింది. దిగుమతి పోటీని తట్టుకోవటంపై ప్రధానంగా దృష్టిసారించింది. ఆర్సీఈపీ మాత్రం స్వేచ్ఛా మార్కెట్ విధానంతో అన్ని దేశాలకు అంతటా సమానావకాశాలు ఉండాలని ఆశిస్తున్నది. ఇప్పటికే దేశంలో ఉత్పత్తి రం గం తీవ్ర ఒత్తిడితో ఉత్పత్తిలో కోతలు విధిస్తున్న దుస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ వస్తుతాకిడి మూలంగా మరింతగా దేశీయ ఉత్పత్తి కృషించిపోయి, పెద్దఎత్తున ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
biswajith-Dhar
ప్రాంతీయ సమగ్ర భాగస్వామ్య ఒప్పందం నుంచి భారత్ తప్పుకు న్న పరిస్థితుల్లో అన్నివైపుల నుంచి విమర్శనాత్మక విశ్లేషణలు వస్తున్నా యి. కొందరి అభిప్రాయం ప్రకారం.. తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతుల అవకాశాలను చేజార్చుకున్నట్లు అయ్యింది. అలాగే ఆర్సీఈపీ భాగస్వామ్య దేశాలు ఇచ్చే స్థానిక ప్రయోజనకర ఆర్థిక వనరులను కోల్పోయినట్లు అయ్యిందన్న వాదనలూ ఉన్నాయి. స్వేచ్ఛామార్కెట్ విధానాల ఫలితంగా కొరియా, జపాన్ దేశాల మార్కెట్ పోటీని తట్టుకు నేవిధంగా ఉత్పత్తి నాణ్యతను పెంచుకోవటానికి చొరవ చూపటంలో వెనుకబడటం దీర్ఘకాలికంగా నష్టదాయకం అంటున్నారు. ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా వస్తు నాణ్యత ప్రమాణాల్లో చొరవ చేజార్చుకోవటం తగదన్న వాదన ఉన్నది.

ఈ కోణంలోంచి భారత్ ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఏసియన్ దేశాలుగా కొరియా, జపాన్ దేశా లు వస్తూత్పత్తిలో సాధించిన ప్రగతిని, మిగతా దేశాలు కూడా అం దుకుని ముందుకుసాగాలి. తద్విరుద్ధంగా ఆలోచిస్తే దీర్ఘకాలికంగా ప్రాం తీయశక్తులు బలోపేతమవటం కష్టసాధ్యం అవుతుంది. కొరియా, జపా న్ దేశాలు స్థానికతకు పెద్దపీట వేస్తూనే, ఉత్పత్తిని ప్రపంచమార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా పెంచి ఎగుమతులకు ప్రాధాన్యం ఇచ్చా యి. తద్వారా తమ ఆర్థికవ్యవస్థలను గణనీయంగా బలోపేతం చేసుకున్నాయి. ఈ అనుభవాలు, గుణపాఠాల నేపథ్యంలోంచి భారత్ కూడా ఆ దిశగా ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్
ఎకనమిక్ స్టడీస్‌లో ప్రొఫెసర్ ) ది వైర్ సౌజన్యం..

254
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles