మహిళా వర్సిటీలు అవసరం


Fri,November 8, 2019 01:15 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలబాలికలకు గురుకుల విద్యనందిస్తున్నది. బాలికల కోసం ప్రత్యేకంగా 475 కస్తూరిబా గాంధీ విద్యాలయాలను, ఇంటర్‌స్థాయి వరకు 30కిపైగా గురుకుల వ్యవస్థలో డిగ్రీ మహిళా కళాశాలలను ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయమైనవి. ఇదేరీతిలో తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేయాలె.

Stu
ఆర్థికాభివృద్ధికి అత్యధికంగా తోడ్పడే మానవ వనరుల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా విద్యారంగంలో సమూల మార్పు లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ తరుణంలో దేశ జనాభాలో సగభాగమైన మహిళా విద్యాభివృద్ధికి తగిన ప్రాధాన్యాన్ని నూతన విద్యావిధానం 2019 రూపకల్పనలో, అమలులో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో మహిళా అక్షరాస్యత 65.46 శాతం. ఇది ప్రపంచ మహిళా సగటు అక్షరాస్యత 79.7 శాతం కన్నా తక్కువ. ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి లో జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో 31.2 శాతమే భాగస్వాములు కావటం గమనించవచ్చు. మన దేశంలో 50 మిలియన్ల యువజన స్త్రీలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. వీరు రెండవ శ్రేణి పౌరులుగా గ్రామీణ ప్రాం తాల్లో జీవనం కొనసాగిస్తూ ఎలాంటి పనిచేసే నైపుణ్యం లేక దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కాలేకపోతున్నారు. దేశ ప్రగతికి భారంగా, దూరంగా ఉంటున్నారు. మహిళలకు విద్యా సదుపాయాలు పెరిగితే బాల్యవివాహాలు తగ్గిపోతాయి. చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తగ్గుతుం ది. మతా-శిశు మరణాలు కూడా తగ్గిపోతాయి.

కుటుంబ ఆరోగ్యంపై అవగాహన కలుగడం వల్ల దేశ పరిపాలనలో, రాజకీయాల్లో పాల్గొని యువజన స్త్రీలు దేశ ఆర్థికాభివద్ధిలో భాగస్వాములయ్యే అవకాశాలు పెరుగుతాయి. చైనా 82.7 శాతం మహిళా అక్షరాస్యత వల్ల ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా విరాజిల్లుతున్నది. కానీ మన దేశంలో మహి ళా అక్షరాస్యత 65.46 శాతం ఉండటం వల్ల ప్రపంచ దేశాలతో పోటీపడలేకపోతున్నాం. ఈ వాస్తవాన్ని గ్రహించి 2009లో నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని రూపొందించారు. మహిళా అక్షరాస్యతకు, మహిళాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. అయినా అభివృద్ధి, అక్షరాస్యత ఆశించినస్థాయిలో లేదు. నూతన విద్యావిధానం 2019లోనైనా ప్రత్యేకంగా మహిళా విద్యకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. యాభై శాతం స్త్రీలు పేద దేశాల్లో సెకండరీ విద్యకు దూరంగా ఉండటం వల్ల దేశ ఆర్థికాభివృద్ధిలో వెనుకబడటం మనం గమనించవచ్చు.

మన దేశ ఉన్నత విద్యారంగాభివృద్ధిలో స్త్రీ, పురుషులకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశవ్యాప్తంగా ఉన్నతవిద్యలో యువతుల సంఖ్య పెరుగుతోంది. 3.74 కోట్ల మంది విద్యార్థులు డిగ్రీ, ఆపై ఉన్నత విద్య అభ్యసిస్తుండగా వారిలో అబ్బాయిలు 1.92 కోట్ల మంది ఉంటే అమ్మాయిలు 1.82 కోట్ల మంది ఉన్నారు. యువతులు ఉన్నత విద్యలో 48 శాతం ఉన్నారు. దేశంలో మొత్తం 993 వర్సిటీలు ఉండగా మహిళల కోసం ప్రత్యేకంగా 16 విశ్వవిద్యాలయాలే ఉన్నాయి. మహిళా విశ్వవిద్యాలయాలు రాజస్థాన్‌లో మూడు, తమిళనాడులో రెం డు, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఢిల్లీ, హరియానా హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్క టి ఉన్నాయి. మన తెలంగాణలో ఒకటి కూడా లేదు. తెలంగాణ మొత్తం కళాశాలల్లో 10.82 శాతమే బాలికల కోసం ఉన్నాయి.

దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో యాభై శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థినులకు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. రాష్ర్టాల్లో నూతనంగా ఏర్పాటుచేసే ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో మహిళా విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలె. ప్రపంచ స్థాయిలో మన మహిళా విద్యార్థినులు రాణించేలా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలె. శాస్త్ర, సాంకేతిక, న్యాయ, పరిపాలనా అభివృద్ధిలో గ్రామీ ణ, పట్టణ, పేదరిక నిర్మూలనకు దోహదపడే రంగాల్లో న్యాయ, వైద్య, వ్యవసాయ విద్యాకళాశాల్లో ప్రత్యేక కోర్సులను రూపొందించాలె. తద్వా రా మహిళా శ్రామిక శక్తిని సైతం సక్రమంగా ఉపయోగించుకోగలిగిన వారమవుతాము.
Anabheri-Rajeshwar-rao
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలబాలికలకు గురుకుల విద్యనందిస్తున్నది. బాలికల కోసం ప్రత్యేకంగా 475 కస్తూరిబా గాంధీ విద్యాలయాలను, ఇంటర్‌స్థాయి వరకు 30కిపైగా గురుకుల వ్యవస్థలో డిగ్రీ మహిళా కళాశాలలను ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయమైనవి. ఇదేరీతిలో తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలె. విశ్వవిద్యాలయాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలను కల్పించాలె.

ఈ విధంగా ఇతర రాష్ర్టాలకు మార్గదర్శిగా వ్యవహరించాలె. మహిళా సాధికారత కోసం, పేదరిక నిర్మూలన కోసం కృషి చేయా లె. మహిళలు ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా ప్రత్యేక వృత్తి విద్యాకోర్సులను ప్రవేశపెట్టాలె. నూతన రాష్ట్రంలో ఏర్పాటుచేసే ప్రైవేట్ విశ్వవిద్యాలయా ల్లో భాగంగా మహిళా విశ్వవిద్యాలయాలను స్థాపించే స్వచ్ఛంద సేవా సంస్థలను, ప్రైవేట్ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో సైతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పారిశ్రామిక వేత్తలందించే ఆర్థికవనరులను మహిళా విద్యాసంస్థల స్థాపనకు లేదా మహిళా విద్యార్థులను ప్రోత్సహించేందుకు దోహదపడేలా కృషిచేయాలె. రాష్ట్రంలోని మేధావులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్చంద సేవా సంస్థలు మహిళలకు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలను కల్పిం చే అవకాశాలను పరిశీలించాలె. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళలు సైతం ప్రధాన భూమిక వహించే అవకాశం కల్పించాలె.

213
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles