సెక్యులరిస్టుల నిష్క్రియాపరత


Thu,November 7, 2019 12:59 AM

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ఇక్కడ బీజేపీ భావజాలం అతి నెమ్మదిగానైనా సరే విస్తరిస్తున్నదనేది ఒక చేదు నిజం. ఇందులో కొంత వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోదీ కారణంగా అయినప్పటికీ, ఆయనతో నిమిత్తం లేకుండా కూడా వివిధ కారణాల వల్ల ఇది జరుగుతున్నది. అయితే అదెంత సమస్యో తమను తాము సెక్యులరిస్టులుగా చెప్పుకునేవారి నిష్క్రియాపరత అంతకుమించిన సమస్య అవుతున్నది. సెక్యులరిస్టులమనే వారికి తెలంగాణలో కొరత లేదు. కానీ వారు ఆక్రందనలు మినహా మరేమైనా చేస్తున్నారా?

మోదీ ప్రభుత్వం మొదటిసారి 2014లో ఏర్పడినప్పుడు వీరంతా దానిని సీరియస్‌గా తీసుకోలేదు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున అధికార మార్పిడి సహజమే లెమ్మనుకున్నారు. మోదీ మొదటి విడుత పూర్తవుతున్నా కొద్దీ వారికి ఒక ఆశ ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటుండటం, వ్యవసాయరంగ సమస్యలు, నిరుద్యోగం, నోట్లరద్దు, జీఎస్టీ సృష్టించిన సమస్యలు, బీజేపీ పరివారీయులు దళితులపైన, మైనార్టీలపైనా సాగించిన దాడుల వంటి పరిస్థితులలో బీజేపీ తిరిగి అధికారానికి రాదని అంచనాలు వేశారు. కానీ అది జరుగకపోగా మోదీ మెజారిటీ అనూహ్యంగా మరింత పెరిగింది.

Ashoke
తెలంగాణకు బీజేపీ భావజాలం వల్ల ఇప్పటికిప్పుడు ఉన్న ముప్పేమీ లేదు. యథాతథంగా గల పరిస్థితులను బట్టి చూసినప్పుడు, అటువంటి ముప్పు రాగల అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవు కూడా. అట్లా భరోసాగా మాట్లాడేందుకు కొన్ని కారణాలున్నాయి. తెలంగాణ సమాజంలో మతం ఉంది గాని మతతత్వం చాలా తక్కువ. మతం అనే దానిలో అధిక భాగం తన పద సంప్రదాయంతో మిళితమైనటువంటిది. ఆధునికార్థంలో మతం పట్టణ మధ్య తరగతిది. ఉన్నతవర్గాలది. ఈ రెండువర్గాలతో పాటు గ్రామీణ శిష్ట తరగతి మతం కూడా వ్యక్తిగతం, కుటుంపరంగా ఉంది. అది మతతత్వ స్థాయికి పెరుగటం అరుదుగా కనిపిస్తుంది. అదికూడా ఇతర పరిస్థితులు అందుకు ప్రోద్బలంగా మారినప్పుడు మాత్రమే.

అనగా తెలంగాణ సమాజం మతకోణం నుంచి చూసినప్పుడు మౌలికంగా సెక్యులర్ అనాలి. ఇందుకు దోహదం చేసేవి కొన్ని ఉన్నాయి. ప్రపంచంలోని భిన్న ప్రాంతాలు, సంస్కృతులు, మతాల వారిని ఏ విధంగానైతే భారతదేశం చారిత్రకంగా తనతో ఇముడ్చుకుంటూ వస్తున్నదో, దేశ విదేశాలకు చెందినవారిని తనతో చేర్చుకుని సమ్మిళిత సం స్కృతిని పెంపొందించుకున్న సుదీర్ఘ చరిత్ర తెలంగాణకు ఉన్నది. ఇం దుకు తెలంగాణ ఒక మహా కూడలి అయింది. గంగా-జమునా తెహజీ బ్ అనే మాట భారతదేశానికి ఎంత వర్తిస్తుందో తెలంగాణకు కూడా అం తే వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది గంగా-జమునా-గోదావరి-కావేరిల తెహజీబ్. ఇక్కడి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతుల కారణంగా 19వ శాతాబ్ది నుంచే జరుగుతూ వచ్చిన వివిధ ఉద్యమాలలో స్థానికులతో పాటు ఈ వర్గాలు కూడా పాల్గొనటం ఈ సమ్మిళిత జీవనా న్ని మరింత పెంపొందించింది. వర్తమాన కాలంలో మనం చూస్తున్న సెక్యులరిజానికి ఇటువంటివి దృఢమైన పునాదులయ్యాయి. ఇదంతా చారిత్రకమైనది. ప్రజల సంస్కృతిలో, రక్తంలో రంగరించుకుపోయినటువంటిది.

ఇదే వరుసలో స్వాతంత్య్రానంతర దశకు వచ్చినా, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతి పరిస్థితిని చూసినా సెక్యులరిజానికి అనుగుణమైన విధానాలు కొనసాగుతూ వచ్చాయి. తెలంగాణ ఏర్పడటానికి ముందటి కాలంలో పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీలు మలి దశలలో తమ రాజకీ య ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు అవాంఛనీయ ఎత్తుగడలకు పాల్పడి బీజేపీకి ఎంతోకొంత అవకాశం లభించటానికి కారణమయ్యా యి. ఉదాహరణకు కాంగ్రెస్ నాయకులు గ్రూపు కలహాలతో మత కలహాలకు ఆస్కారం కల్పించటం, టీడీపీ నాయకత్వం బీజేపీతో దోబూచులాడటం వంటివి జరిగాయి. ఇటువంటివి బీజేపీని హైదరాబాద్ నగరం లో సజీవంగా ఉంచాయి. ఆ పార్టీ తన స్వీయ వైఫల్యాల వల్ల కొంత, తెలంగాణ ప్రజల సెక్యులర్ స్వభావం వల్ల కొంతగా జిల్లాలలో బలహీనపడటం లేదా పుంజుకోలేకపోవటం జరిగాయి. కానీ ఈ రెండు పార్టీల వైఫల్యాలు దానికి ప్రాణం పోస్తూ వచ్చాయి. కాంగ్రెస్, టీడీపీలు స్వభావ రీత్యా మధ్యేమార్గ సెక్యులర్ పార్టీలు అయి కూడా పరిపాలనా వైఫల్యా లు, రాజకీయ వైఫల్యాల వల్ల కొంత శూన్యాన్ని సృష్టించాయి. తగు సమర్థత లేక బీజేపీ నాయకత్వం దానిని ఉపయోగించుకొనలేకపోయిందనే ది వేరే విషయం.

వర్తమానానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ చారిత్రకమైన తెలంగాణ సెక్యులరిజానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన రెండు విధాలుగా కొనసాగింపుగా మారింది. యథాతథంగా అధికార పక్షపు వైఖరిలో బలమైన సెక్యులరిజం ఉండగా, పరిపాలనా విధానాలు, చర్య లు దానికి ఆచరణ రూపం ఇస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉద్యమకాలంలోనే ఈ లక్షణాలు ప్రతి దశలో కన్పించాయి. వందల ఏం డ్ల కిందట సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అప్పటి ముస్లిం పాలకుల, స్థానికుల ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అసఫ్‌జాహీల కాలం లో తలెత్తిన ముల్కీ ప్రశ్న ముస్లింలతో పాటు హిందువులకు కూడా సం బంధించినటువంటిది. 1956లో ఆంధ్ర రాష్ట్రంతో విలీనాన్ని వ్యతిరేకించినవారిలో ఇరువురూ ఉన్నారు. తర్వాత సీమాంధ్ర ధనిక వర్గాల దోపిడీ వ్యతిరేక ఉద్యమాల్లో కలిసి భాగస్వాములయ్యారు.

తెలంగాణ ఉద్యమ పు మలిదశ వచ్చేసరికి జాతీయస్థాయిలో బీజేపీ బలపడుతుండినందున, ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో టీడీపీ అంతరించిపోయి ఆ ఖాళీలోకి బీజేపీ రావచ్చుననే భయంతో ఒక పార్టీగా ఎంఐఎం రాష్ట్ర విభజనను వ్యతిరేకించినా, ఒక ప్రజా సమూహంగా ముస్లింలు, ముఖ్యంగా పాత బస్తీ బయట, తెలంగాణ జిల్లాలలో, ప్రత్యేక ఉద్యమం లో పూర్తిగా కలసిపోయారు. ఇటువంటి సుదీర్ఘ నేపథ్యాల వల్ల కొంత, తెలంగాణ జనాభాలో వివిధ కులాలు, మతాలు, జాతుల సంఖ్యలు తగినంత స్థాయిలో ఉండటమనే వాస్తవాన్ని బట్టి కొంత, ప్రజాస్వామిక వ్యవస్థలో పాలన సమతులనంగా, సర్వజన శ్రేయోదాయకంగా ఉండాలనే లక్ష్యం వల్ల మరికొంతగా కేసీఆర్ విధానాలను ప్రభావితం చేస్తున్నాయనుకోవాలి. తెలంగాణకు ఇదంతా ఒక నిఖార్సయిన చారిత్రక సెక్యులర్ నేపథ్యం, వర్తమాన సెక్యులరిజం వాస్తవం.

ఇంతవరకు అంతా బాగున్నది. కానీ సమస్య వస్తున్నది ఎక్కడ? తెలంగాణలో తమను తాము సెక్యలరిస్టులుగా భావించుకునేవారికి కొర త లేదు. వారిలో వివిధ రాజకీయ పార్టీలున్నాయి. ప్రజాస్వామికవాదు లు, మేధావులు, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిగలవారు, గాంధేయవాదు లు, పలురకాల ఉద్యమకారులు, మాజీ ఉద్యమకారులు, రచయితలు, కళాకారులున్నారు. వీరందరికీ ఇటీవల ఒక జంకు మొదలైంది. అం దు కు కారణం కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం అంతకుముందు కన్న పెద్ద మెజారిటీతో ఏర్పడటం, దానితో పాటు ఆ పార్టీ తెలంగాణలో నాలుగు లోక్‌సభ సీట్లు గెలువటం. మోదీ ప్రభుత్వం మొదటిసారి 2014లో ఏర్పడినప్పుడు వీరంతా దానిని సీరియస్‌గా తీసుకోలేదు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున అధికార మార్పిడి సహజమే లెమ్మనుకున్నారు. మోదీ మొదటి విడుత పూర్తవుతున్నా కొద్దీ వారి కి ఒక ఆశ ఏర్పడింది.

ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటుండటం, వ్యవసాయరంగ సమస్యలు, నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ సృష్టించిన సమస్యలు, బీజేపీ పరివారీయులు దళితులపైన, మైనార్టీలపైనా సాగించిన దాడుల వంటి పరిస్థితుల్లో బీజేపీ తిరిగి అధికారానికి రాదని అంచనాలు వేశారు. కానీ అది జరుగకపోగా మోదీ మెజారిటీ అనూహ్యంగా మరింత పెరిగింది. అంతే అనూహ్యంగా తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచారు. ఈ రెండు పరిణామాలతో వీరికి నెత్తిన పిడుగుపడినట్లయ్యింది. జరిగిన దాని కి రకరకాల కారణాలను అన్వేషించారు. అవి ఏమి సమాధానాలు చెప్పినా చివరకు ఊరట మాత్రం లభించలేదు. ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా 2023 ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్‌ను వెనుకకు నెట్టి రెండవస్థానాన్ని సాధించితీరాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాయి. ఇదిచూసి వీరి జంకు మరింత పెరుగుతున్నది.

పైన చర్చించిన దానిని బట్టి సెక్యులరిజానికి తెలంగాణ ఒక పెట్టనికోటగా ఉన్నమాట నిజం. అదే సమయంలో బీజేపీ భావజాలం ఒకవైపు ఆ పార్టీ అధికారం విస్తరిస్తున్నందువల్ల అందులో చేరితో తమకు అవకాశాలు లభించవచ్చుననే ఆశలు మరొకవైపు కొన్నివర్గాలలో నెమ్మదిగానైనా వ్యాపిస్తున్న మాట కూడా కాదనలేని వాస్తవం. దీనినంతా చూస్తూ గాభరాపడటం, తమలో తాము ఎడతెగని శుష్క సంభాషణలు సాగించటం, బీజేపీకి పగ్గాలు వేయవలసింది, వేయలిగింది టీఆర్‌ఎస్ పార్టీయే అనుకోవటం, మోదీ 2024లోనైనా ఓడితే బాగుండునని ప్రార్థించటం, దెబ్బతింటున్న ఆర్థికరంగం వంటివి ఈసారి అయినా ఆ పనిచేయగలవా అనే అంచనాలు, మహారాష్ట్ర, హర్యానా వంటి ఫలితాలలో ఏవో ఆశారేఖల కోసం వెతకటం వంటి నిస్సహాయతలు, ఆక్రందనలు, ప్రార్థనలు మినహా మన సెక్యులరిస్టులు చేస్తున్నది ఏమైనా ఉందా? చేయగలిగింది ఏమీ లేదా? ఇక్కడ ఇంతటి సానుకూలతలు ఉన్నా చేయలేకపోవటం తీవ్ర వైఫల్యం కాగలదు.

393
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles