చరిత్ర పునర్మూల్యాంకనం


Sun,October 13, 2019 12:23 AM

ts-sahitya-charitra
చారిత్రక పరిజ్ఞానం అన్నది మనిషి నాగరికతకు, అభివృద్ధికి దోహదం చేస్తుంది. తమ పూర్వచరిత్రను తెలుసుకొన్నప్పుడే మన భవిష్యత్ ప్రస్థా నం సుగమమవుతుంది. సాహిత్య చరిత్ర సమగ్రంగా లేకపోతే అనంతమైన సృజన కాలగర్భంలో కలిసిపోతుంది. చరిత్ర ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. అన్ని పక్షపాతాలకు అతీతంగా చరిత్రను చరిత్రగానే నిర్మించినప్పుడే అది సార్వకాలీనమవుతుంది. నిలుస్తుంది. తెలుగు సాహిత్య విషయానికి వెళ్తే కందుకూరి వీరేశలింగం పంతులు ఆంధ్ర కవుల చరిత్ర ద్వారా సాహిత్య చరిత్రకు శ్రీకారం చుట్టినప్పటికీ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంతోనే తెలుగు సాహిత్య చరిత్ర కొంతమేరకు సమగ్రతను సాధించిందనే చెప్పా లి. అది మొదలు తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధిం చి అనేక గ్రంథాలు వచ్చాయి. దాదాపు రెండువేల ఏండ్లనాటి సుసంపన్నమైన సాహిత్య సృజన జరిగిన తెలంగా ణ మొదట్నుంచీ నిరాదరణకు, విద్వేషానికి గురైనది. నిజామాంధ్రమున తెనుగు కవులు పూజ్యము అన్న ఒక్క మాటకే మూడు వందల కవులతో సురవరం ప్రతాపరె డ్డి గోలకొండ కవుల సంచిక వెలువరించారు. గడియారం రామకృష్ణ శర్మ అలంపురంలో తెలంగాణ సాహిత్య వైభవాన్ని భువన విజయాన్ని తలపించేలా నిర్వహించారు. తెలుగున కు నిక్కమైన యీ దేశమందు కవి వరేణ్యులు, పండితుల్ గలరు కల రు.. కవులున్నారు.. కవి ప్రకాండుల కు సత్కారమ్ము కల్పించ భూధవులున్నారు.. తక్కువ ఏమున్నది మాకు రాష్ట్రమున మాకు తెల్గు నేర్పింతురే.. అని మందడి వెంకటకృష్ణ కవి ఘాటు గా చెప్పాల్సిన పరిస్థితులను ఆంధ్రకవులు, రచయితలు, సాహిత్య చరిత్రకారులు కల్పించారు. చివరకు తెలుగు సాహిత్యమంటే శ్రీశ్రీ, గురజాడ వంటివారు మినహా తెలంగాణలో కవులను గుర్తించే మనసులే లేకుండాపో యాయి.


పైగా ఇక్కడ కవిత్వం లేదని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది. పోతనను ఒంటిమిట్టవాడని పురా ణం హయగ్రీవశాస్త్రి అనే ఓ అజ్ఞాని పలికిన చిలుకపలుకులను నేటికీ వల్లెవేస్తూ కడప జిల్లా చరిత్రలో ప్రచారం చేసుకొంటూనే ఉన్నారు. నన్నయ్యభట్టు (క్రీ.శ.1050) కు వందేండ్లకు ముందే మల్లీయరేచన (క్రీ.శ.950) కవిజనాశ్రయం అన్న తొలి ఛందోగ్రంథం రాశారు. 1950 లోనే వావిళ్లవారు దాని మూడో ప్రచురణ వెలువరించినప్పుడు దానికి పీఠిక రాసిన ప్రముఖ విమర్శకుడు నిడుదవోలు వెంకట్రావు విస్పష్టంగా తేల్చిచెప్పినా ఇవాళ్టికి కూడా జీర్ణించుకోలేని వారు ఎందరో ఉన్నారు. అం తకుముందే జినవల్లభుడి కురిక్యాల శాసనంలో తొలి తెలుగు పద్యాలున్నాయి. ఇవాళ తెలుగు ప్రాచీన సాహి త్య హోదా సాధించగలిగిందంటే.. అందుకు పంపడి జినేంద్రపురాణం వంటి రచనలే కదా కారణం. తెలంగాణ వాళ్లు శ్రీశ్రీని, గురజాడను, విశ్వనాథను, చలం.. ఇలా అందరినీ నెత్తిన పెట్టుకొని ఆరాధనీయులను చేశా రు కానీ.. తెలంగాణేతరులు పోతనతోపాటు అప్పకవి, సోమనాథుడు, మల్లినాథసూరి.. అందరినీ తమ ప్రాం తాలకు ఎత్తుకుపోదామని చూశారు. మల్లినాథసూరిని ఎక్కడో ఉత్తరాదివారు గుర్తించి పరిశోధనలు చేశారు తప్ప తెలుగు సాహిత్యవేత్తలు.. ఆనాటి ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోలేదు. గురజాడ దిద్దుబాటు కథ రావడానికి పదేండ్లకు ముందు బండారు అచ్చమాంబ కథ రాసిందన్న విషయాన్ని కావాలనే సాహిత్యకారులు విస్మరించారు. గురజాడకు సమకాలంలోనే మాడపాటి హనుమంతరావు కథలు ఆంధ్రభారతి పత్రికలో అచ్చయిన విషయాలను కూడా అదేవిధంగా విస్మరించారు. కేంద్ర, రాష్ర్ట సాహిత్య అకాడమీలు ప్రచురించిన కథా సంకలనాల్లోనూ తెలంగాణ కథకు చోటే కల్పించని దుర్మార్గం మరెక్కడా ఉండదేమో.

ఇవన్నీ కూడా తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు మూలాలైనాయి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన శుభసందర్భంలో తెలంగాణ అస్తిత్వాన్ని నలుదిశలా చాటిచెప్తూ ఘనమైన చరిత్రను సంపూర్ణంగా, సమగ్రంగా నిర్మించే ప్రయత్నాలు వ్యవస్థలు, వ్యక్తులు ఎవరిస్థాయిలో వారు చేస్తున్నారు. చాలామంది పరిశోధకులు అనేక దిశల్లో ముందుకుసాగుతున్నారు. గత ఆరేండ్లలో అనేక రచనలు ఈ మార్గంలో అచ్చయినాయి. వీటిలో కొన్ని రచనలు పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని చేసినవి అయితే, మరికొన్ని సైద్ధాంతిక దృక్పథాన్ని ప్రతిఫలింపజేసేవి ఉన్నాయి. కానీ సంపూర్ణంగా, సమగ్రంగా తెలంగాణ సాహిత్య చరిత్రను నిర్మించే ప్రయత్నంలో భాగంగా నీల్‌కమల్ సంస్థ చేపట్టిన తెలంగాణ సాహిత్య చరిత్ర మూడు సంపుటాలలో వెలువరించింది.. తెలంగాణ ఆత్మకథల పరిశోధకుడు, ప్రఖ్యాత తెలుగు సాహిత్య విమర్శకుడు రచయిత డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సంపాదకత్వంలో వెలువడిన చక్కని సంకలనం ఇది. తెలంగాణ సాహిత్య చరిత్రను సంప్రదాయ సాహిత్యం, వివిధ సాహిత్య ప్రక్రియలు, ఆధునిక సాహి త్యం అన్న మూడు భాగాలుగా విభజించి మూడు సంపుటాల్లో వెలువరించారు. దాదాపు వేయి పుటల సర్వ సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్రను నిర్మించడం అంటే భగీరథ ప్రయత్నమేనని చెప్పాలి. నీల్‌కమల్ సంస్థ అధినేత సురేశ్‌చంద్రశర్మ తెలంగాణాభిమానంతో ఇప్పటికే తెలంగా ణ వైతాళికులు పేరుతో తెలంగాణలో ని వివిధరంగాల్లో ఉతృ్కష్టమైన సేవలందించిన మహానుభావుల జీవిత విశేషాలతో మూడు సంపుటాల్లో ప్రచురించారు. ఆ సంపుటాలకు కూడా బాలశ్రీనివాసమూర్తే సంపాదకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సంపుటాల్లో తెలంగాణలో ఆవిర్భవించిన అనేక ప్రక్రియా వైవిధ్యాన్ని ఒక్కో వ్యాసరచయిత విపులంగా చర్చించారు.
K-santosh-kumar
తెలుగు సాహిత్యంలో ఉద్భవించిన ఇరువైకి పైగా ప్రక్రియలు ఇక్కడే పుట్టాయి. ఇక్కడినుంచే దిగువకు ప్రవహించాయి. ఈ అంశాన్ని ఏకపక్షంగా సాహిత్య చరిత్రకారులు విస్మరించారు. ఈ అంశాన్ని సమగ్రంగా ఈ సంపుటాలు మన కు అందిస్తున్నాయి. సంప్రదాయ కవిత్వంలో మన కవు లు చేసిన ప్రయోగాలు అన్నీఇన్నీ కావు. పాల్కుర్కి సోమనాథుడు మొదలుపెట్టిన దేశి సాహిత్యం, గేయ సాహిత్యం, ఆధునిక కవిత్వం.. అద్భుతమైన పలుకుబడులతో సహజంగా వచ్చిన అలంకారాలతో కూడిన శబ్ద చిత్రాలు తెలంగాణ సాహిత్యానికి శాశ్వతత్వాన్ని కల్పించాయి. కావ్యాలు, అచ్చతెనుగు కావ్యాలు, చిత్రప్రయోగాలు, శతకాలు, బంధ కవిత్వం, అష్టప్రహరి వంటి ప్రయోగాలు.. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనంతమైన సారస్వత సృజన తెలంగాణలో జరిగింది. తెలంగాణ రచయితలు తమ అనుభూతిని, సృజనను వ్యక్తం చేయడానికి ఒక ప్రక్రియకు పరిమితం కాలేదు. ప్రతి రచయితా బహుళ ప్రక్రియల్లో రచనలు చేసినవారే. తమ సృజనశీలతను విస్తృతంగా వ్యాప్తిచేసిన వారే. వీటన్నిం టి గురించి కూడా నీల్‌కమల్ వారి తెలంగాణ సాహిత్య చరిత్ర సమగ్రంగా చర్చించింది. తెలుగు సాహిత్యాన్ని అన్నిమార్గాల్లో.. అన్ని వైవిధ్యాలలో సుసంపన్నం చేసిన తెలంగాణ సాహిత్య వైభవాన్ని నీల్‌కమల్ వారు తమ తెలంగాణ సాహిత్య చరిత్ర సంపుటాలతో వెలుగులోకి తీసుకొని రావడం నిస్సందేహంగా అభినందనీయం. ఈ గ్రంథాలకు సంపాదకత్వ బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చిన బాలశ్రీనివాసమూర్తి కృషి ప్రశంసనీయం.

441
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles