పోషకాహార లోపం తీరేదెట్లా?


Sat,October 12, 2019 01:21 AM

గతేడాది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పెట్టిన ఒక ట్వీట్ వివాదాస్పదంగా మారింది. మాంసాహారం జంక్‌ఫుడ్‌తో సమానమని, శాకాహారమే ఆరోగ్యకరమైనదని ఈ ట్వీట్‌లో పేర్కొన్నది. వ్యతిరేకత వస్తున్నదనే భయంతో మళ్లీ ట్వీట్‌ను తొలిగించింది. మహిళా శిశు మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మాంసాహారం అనారోగ్యకరం కాదు.

RSS
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతి ఏటా జరిపే విజయదశమి కార్యక్రమానికి ఈసారి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ చైర్మ న్ శివ్ నాడార్‌ను ఆహ్వానించింది. శివ్ నాడార్ ప్రసం గం ఈ హిందుత్వ సంస్థ భావజాలానికి భిన్నంగా సాగింది. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మూకదాడులపై చేసిన వ్యాఖ్యలు ప్రచారం పొందాయి. కానీ శివ్ నాడార్ అభిప్రాయాలకు అంత ప్రాచుర్యం లభించలేదు. ప్రభుత్వ పరిపాలనలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలని ఆయ న అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఆహారపుటలవాట్లపై ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు గమనార్హమైనవి. నా కుమార్తె ఒక విద్యా కార్యక్రమంలో అనుసరించిన విధానం మీకు నచ్చకపోవచ్చు, ఆమె పిల్లల ఆహారంలో మాంసకృతులను పెంచడం కోసం వారిచేత కోడిమాంసం తినిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమప్రాంతంలో పిల్లలు కురుచగా ఉంటారు. వారికి పోషకాహారం అందించవలసిన అవసరం ఉన్నది. వారు అన్నం తినరు, రొట్టె తింటారు. అప్పుడే కాల్చిన రొట్టెలు తినాలి, లేకపోతే చల్లారిపోతాయి అని శివ్ నాడార్ వివరించారు.
ప్రభుత్వం మాత్రమే దేశాభివృద్ధిని సాధించలేదని, ప్రైవేట్ సంస్థలు కూడా సామాజిక రంగంలో సమాన బాధ్యత చేపట్టాలని ఆయన వివరించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఐదేండ్లలోపు పిల్లలలో 46 శాతం మంది కురుచగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా తగినంత అభివృద్ధి చెంది ఉండరు. పోషకాహార లోపమే ఇందుకు కారణం. దేశంలో గ్రామీణ ప్రాంతంలో నిరాశానిస్పృహలు పెరుగుతున్నాయి. నిరుద్యోగం కూడా పెరుగుతున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం దీనిని గుర్తించడానికి నిరాకరిస్తున్నదని నాడార్ వివరించారు. ఇందుకు ఆధారంగా తమ సంస్థ నియోగించిన బృందం తెలుసుకున్న విషయాలను ఆయన వివరించారు. వ్యవసాయ కుటుంబం సగటున నెలకు రూ.6,400లను సంపాదిస్తున్నది. కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే ఒక్కొక్కరి వ్యక్తిగత ఆదాయం సగటున రూ.1300. గ్రామీణ ప్రాంతంలో జీవనోపాధి అవకాశాలు కూడా చాలా తక్కువ. వ్యవసాయం మినహా, మిగతా రంగాలలో అవకాశాలు లేవని నాడార్ వివరించారు. దసరా సందర్భంగా ఒక నైతిక సం దేశం కూడా ఆయన అందించారు. రావణుడిపై రాముడి విజయాన్ని మనం ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ధర్మంపై అధర్మం, మంచిపై చెడు విజయం సాధించడాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ విజయం సంపూర్ణమైంది కాదు. ఆంతరంగికంగా, బాహ్యంగా జరుపవలసిన ఈ పోరాటం నిరంతరమైనదని ఆయన వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న విచారకర పరిస్థితిని వివరిస్తూ భోజనంలో మాంసం చేర్చవలసిన అవసరాన్ని శివ్ నాడార్ వివరించారు. కానీ, ఈ అంశాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి భిన్నమైన ఆలోచన ఇది. నాడార్ ప్రసంగం మోదీ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ ప్రసంగానికి భిన్నంగా ఉంది. ఒకప్పుడు మోదీ ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తిచూపిన భగవత్ ఈసారి విజయదశమి ప్రసంగంలో మాత్రం మోదీ ప్రభుత్వాన్ని సమర్థించారు.
సంఘపరివార్ ఎంతోకాలంగా శాకాహారాన్ని ప్రచారం చేస్తున్నది. ఇది బ్రాహ్మణీయ ప్రభావం వల్ల ఏర్పడిన భావజాలం. గత శతాబ్ద కాలంలో ఈ భావజాలాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాయి. బీజీపీయేతర ప్రభుత్వాలు కూడా శిశుసంక్షేమ కార్యక్రమాల్లో శాకాహారాన్ని మాత్రమే అందిస్తున్నది. సమీకృత శిశు అభివృద్ధి సేవల్లో కూడా ఇదే విధానం కనిపిస్తున్నది.

ఇందుకు కారణం తగిన నిధులు లేకపోవడం కూడా. కానీ చాలా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో (జార్ఖండ్, ఈశాన్య రాష్ర్టాలు మినహా) శాకాహార భోజనమే పిల్లలకు పెట్టాలని సూచనలు చేస్తున్నారు. పలు సంక్షేమ కేంద్రాలలో కోడిగుడ్లను కూడా ఆహార పదార్థాల జాబితా నుంచి తొలిగించారు. మత సాంస్కృతిక మనోభావాలు దెబ్బతింటాయనే వాదనతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందించడానికి అక్షయపాత్ర ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు కాంట్రాక్టు ఇచ్చింది. ఈ సంస్థ కోడిగుడ్లను ఆహారం నుంచి తొలిగించడం వివాదాస్పదమైంది. ఆహారం నుంచి కోడిగుడ్లే కాదు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు కూడా తొలిగించామని, వాటి స్థానంలో అంతే పోషక విలువలు కలిగిన ఇతర పదార్థాలను చేర్చామని ఆ సంస్థ వివరించింది. ప్రాంతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. గతేడాది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పెట్టిన ఒక ట్వీట్ వివాదాస్పదంగా మారింది. మాంసాహారం జంక్‌ఫుడ్‌తో సమానమని, శాకాహారమే ఆరోగ్యకరమైనదని ఈ ట్వీట్‌లో పేర్కొన్నది. వ్యతిరేకత వస్తున్నదనే భయంతో మళ్లీ ట్వీట్‌ను తొలిగించింది. మహిళా శిశు మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మాంసాహారం అనారోగ్యకరం కాదు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మధ్యాహ్న భోజన విషయమై రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది. ఈ సూచనల ప్రకారం, ప్రాంతీయ ప్రమాణాల ప్రకారం ప్రామాణిక భోజనాలను అందించాలి. కానీ, పలు రాష్ర్టాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ మత భావనల మూలంగా శాకాహార భోజనం అందించడం జరుగుతున్నది.
(వ్యాసకర్త: ది వైర్ డిప్యూటీ ఎడిటర్)
ది వైర్ సౌజన్యంతో...
Ajay

442
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles