‘కాళేశ్వరం’లో ఎత్తిపోతల ప్రక్రియ


Thu,October 10, 2019 10:30 PM

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు ఒక్క చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదు. ఎత్తిపోసిన నీరంతా కడెం నుంచి ఎల్లంపల్లికి వచ్చిన నీరేనని ఇటీవల కొం దరు మాట్లాడుతున్నారు. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం లింక్ 2 పంపుల ద్వారా మిడ్ మానేరుకు, అక్కడి నుంచి లోయర్ మానే రుకు, వరద కాలువకు ఎత్తిపోసిన నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపో సినవే కానీ కాళేశ్వరం నీరు కాదని వారు భావిస్తున్నారు. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూప స్వభా వాలపై, ఎత్తిపోతల ప్రక్రియపై ఏ మాత్రం అవగాహన లేని విశ్లేషణ ఇది. ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రత్యేకమైన ప్రాజెక్టుగా పరిగణించడంవల్ల వచ్చిన చిక్కు ఇది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిలభ్యత నీటి వినియోగాలపై అవ గాహన లేకుండా చేసిన మాటలు. ప్రాజెక్టులో నీటిలభ్యత నీటి వినియో గం ఈ కింది పట్టికలో గమనించవచ్చు. ఇవి కేంద్ర జల సంఘం ఆమో దించిన వివరాలు.


kaleshwaram-irrigation
పై పట్టికను పరిశీలిస్తే తెలిసే విషయం ఏమిటంటే.. ఎల్లంపల్లి ప్రాజెక్టు వేరు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. కాబట్టి ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడం అంటే కాళేశ్వరం నీరు ఎత్తిపోయడమే. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోసే నంది పంప్‌హౌజ్ (ప్యాకేజీ 6), గాయత్రి పంప్‌హౌజ్ (ప్యాకేజీ 8) కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినవే. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఎట్లా ఉం టుందో తెలియక వారు తప్పుడు వాదనలు చేస్తున్నారని భావించాలి.

kaleshwaram-irrigation2
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఎట్లా ఉంటుంది? మూడు మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసే అవకాశాలు కాళేశ్వరం సిస్టంలో ఉన్నది. మొదటిది శ్రీరాంసాగర్‌కు వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా మిడ్‌మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానే రు చేరుతాయి. ఇవిపోగా ఇంకా వరద ఉంటే గేట్ల ద్వారా నదిలోకి వదు లుతారు. అవి ఎల్లంపల్లికి వెళ్తాయి. ఎల్లంపల్లి నిండితే సుందిళ్ల, అన్నా రం, మేడిగడ్డకు వెళ్తాయి. ఆ తర్వాత తుపాకులగూడెం ద్వారా పోలవ రానికి వెళ్తాయి. శ్రీరాంసాగర్‌కు కనీసం మూడేండ్లకు ఒకసారి అయినా వరద వచ్చే అవకాశం ఉన్నదని గత 25 ఏండ్ల వరద చరిత్ర చూస్తే తెలు స్తున్నది. శ్రీరాంసాగర్‌కు వరద వచ్చిన స్థితిలో కాళేశ్వరం లింక్-1 పం పులు (మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి), లింక్-2 పంపులు (ఎల్లంపల్లి నుం చి మిడ్‌మానేరుకు) తిప్పే అవసరం రాదు.

శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ట్రయల్న్ కోసం వరద కాలువకు నీటిని ఎత్తిపోయడం జరిగింది. ఈ నీరంతా ఎల్లంపల్లి నుంచి తీసుకున్నప్పటికీ ఆ నీరు కాళేశ్వరం నీరే తప్ప వేరుకాదు. ప్రాజెక్టు విమర్శకులు కడెం నీళ్లతో కాళేశ్వరం సోకులు అంటూ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సబబు కాదు. ప్రాజెక్టు రూపకల్పనా సమయంలో ముఖ్యమంత్రి ఏ కలగన్నారో అది ఇవ్వాళ్ళ సాక్షాత్కారమైంది.


ఇక రెండోస్థితి శ్రీరాంసాగర్‌కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది నుంచి, శ్రీరాంసాగర్ ఎల్లంపల్లికి మధ్యన ఉన్న పరీవాహక ప్రాంతం నుంచి వరదవచ్చే అవకాశం ఉన్నది. ఈ స్థితిని ఈ సంవత్సరం మనం చూశాం. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్-1 పంపులు తిప్పే అవసరం రాదు. ఎల్లంపల్లి నుంచే లింక్-2 పంపులు తిప్పి నీటిని మిడ్‌మానేరుకు చేరవేయడం, అక్కడి నుంచి ఎగువకు కొండ పోచమ్మసాగర్ దాకా ఎత్తిపోయడం, దిగువ మానేరుకు, అక్కడి నుంచి కాకతీయ కాలువ ద్వారా శ్రీరాంసాగర్ మొదటిదశ, రెండోదశ ఆయకట్టుకు నీటి సరఫరా, పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి నీటిని ఎత్తి పోయడం జరుగుతుంది.

గోదావరి నది 150 కిలో మీటర్ల పొడవున సజీవమైంది. గోదావరి నీరు దిగువన మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఎదురెక్కి వస్తుంటే ప్రజలు గోదావరి మాతకు జల నీరాజనం పట్టినారు. జల భోజనాలు, జల జాతరలు నిర్వహించుకున్నారు. కరువు కాలంలో గోదావరి ఇట్లా ఎదురెక్కి రావడం వారికి ఒక కొత్త అనుభవం. ఇక గోదావరి ఎండిపోయే పరిస్థితి రాదు. అక్టోబర్ నుంచి వానలు కురువయి. అయితే దిగువ గోదావరిలో నీటి ప్రవాహాలు గణనీయంగా ఉంటాయి. కనుక వర్షాలు లేనికాలంలో నీటిని మేడిగడ్డ జలాశయం నుంచి ఎత్తిపోయడం తప్పదు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్-1కు ఉన్న ప్రాధాన్యం.


మూడోదిపై రెండుచోట్ల నీటిలభ్యత లేని సందర్భాల్లో మాత్రమే లింక్-1, లింక్-2 పంపులను తిప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం జూన్, జూలై నెలల్లో రాష్ట్రమంతా కరువు పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. గోదావరి నది విజయవంతంగా 115 కి.మీ ఎదురెక్కివచ్చింది. మేడిగడ్డ జలాశయం నుంచి లక్ష్మీ పంప్‌హౌజ్ ద్వారా 12 టీఎంసీలు అన్నారం జలాశయానికి, అన్నారం జలాశయం నుంచి సరస్వతి పంప్‌హౌజ్ ద్వారా 5 టీఎంసీలు సుందిళ్ల జలాశయానికి, పార్వాతి పంప్‌హౌజ్ ద్వారా సుందిళ్ల జలాశయం నుంచి ఎల్లంపల్లి జలాశయానికి 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం జరిగింది. ఈ లోపున ఎగువన కడెం, ఎల్లంపల్లి పరీవాహక ప్రాంతం నుంచి వరద రావడం ప్రారంభమైంది. వెంటనే ప్రభుత్వం లింక్-1 పంపులను ఆపివేసింది. ఎల్లంపల్లిలో ఎఫ్‌ఆ ర్‌ఎల్ వరకు నీరు చేరగానే లింక్ 2 పంపుల ద్వారా మిడ్ మానేరుకు ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభమైంది. లింక్-2 పంపుల ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు 12 టీఎంసీలు, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకంలో బిగించిన పంపుల వెట్న్ కోసం 2 టీఎంసీలు వరద కాలు వకు ఎత్తిపోయడం జరిగింది. మిడ్‌మానేర్‌లో 15 టీఎంసీల నీరు నిం డిన తర్వాత డ్యాం క్రెస్ట్ గేట్లను తెరిచి లోయర్ మానేరుకు10 టీఎంసీల నీటిని తరలించడం జరిగింది. అదేవిధంగా శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ట్రయల్న్ కోసం వరద కాలువకు నీటిని ఎత్తిపోయడం జరిగిం ది.
sridhar-rao-deshpande
ఈ నీరంతా ఎల్లంపల్లి నుంచి తీసుకున్నప్పటికీ ఆ నీరు కాళేశ్వరం నీరే తప్ప వేరుకాదు. ప్రాజెక్టు విమర్శకులు కడెం నీళ్లతో కాళేశ్వరం సోకు లు అంటూ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతూ ప్రజలను తప్పుదో వ పట్టించడం సబబు కాదు. ప్రాజెక్టు రూపకల్పనా సమయంలో ముఖ్యమంత్రి ఏ కలగన్నారో అది ఇవ్వాళ్ళ సాక్షాత్కారమైంది. జూలైలో వానలు లేక కరువు తాండవిస్తున్నది. అయినా గోదావరి నది 150 కిలో మీటర్ల పొడవున సజీవమైంది. గోదావరి నీరు దిగువన మేడిగడ్డ నుం చి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఎదురెక్కి వస్తుంటే ప్రజలు గోదావరి మాతకు జల నీరాజనం పట్టినారు. జల భోజనాలు, జల జాతరలు నిర్వహించుకున్నారు. కరువు కాలంలో గోదావరి ఇట్లా ఎదురెక్కి రావడం వారికి ఒక కొత్త అనుభవం. ఇక గోదా వరి ఎండిపోయే పరిస్థితి రాదు. అక్టోబర్ నుంచి వానలు కురువయి. అయితే దిగువ గోదావరిలో నీటి ప్రవాహాలు గణనీయంగా ఉంటాయి. కనుక వర్షాలు లేనికాలంలో నీటిని మేడిగడ్డ జలాశయం నుంచి ఎత్తిపో యడం తప్పదు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్-1కు ఉన్న ప్రాధా న్యం. ఈ ప్రాధాన్యం గోదావరి ఎదురెక్కి వస్తున్న సందర్భంలోనేనని ప్రజలకు అర్థమైంది. విమర్శకులు మాత్రం వెనుకబడిపోయారు.
(వ్యాసకర్త: ముఖ్యమంత్రి ఓఎస్డీ)

533
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles