‘ముప్ఫై’ రోజుల స్ఫూర్తి కొనసాగాలె


Thu,October 10, 2019 10:30 PM

రాష్ట్ర ఆవిర్భావ అనంతరం దేశంలో రాష్ర్టాలన్నింటికి ఆదర్శప్రాయంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నది. భౌతిక వనరులు, ప్రకృతి వనరులు, మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పరితపిస్తున్నది. ఇందు లో భాగంగానే మన గ్రామాలను, మన పల్లెలను మన మే అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన గ్రామాభ్యుదయ ముప్ఫై రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకు న్నాం. ఈ కార్యక్రమాన్ని ముప్ఫై రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్న ది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించి తెలంగాణ గ్రామాలు అభ్యుదయ, ఆదర్శగ్రామాలుగా రూపుదిద్దాలనే గొప్ప సంకల్పంతో ముందుకుపోవాలి. పంచాయతీల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థలకు కావాల్సిన నిధులు ప్రతి నెల నిరాటంకంగా విడుదల చేస్తున్నది. నిధులపై, విధులపై స్పష్టతనిచ్చి అధికారాలు కూడా బదలాయించింది. అయినా కూడా గ్రామాలు బాగుపడకపోతే ఎలా? స్వాతంత్య్రం వచ్చి 72 ఏండ్లు పూర్తయ్యాయి.ఈ సందర్భంగానైనా గ్రామాల్లో మార్పు రావాలని ప్రభుత్వం ముప్ఫైరోజుల కార్యక్రమాన్ని తలపెట్టింది. కాబట్టి ప్రజలందరూ త్రికరణ శుద్ధితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిత్యం కొనసాగించాల్సిన చారిత్రక అవసరం ఉన్నది. గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులే కాకుండా యూత్ సభ్యులు, ఉద్యోగులు, మహిళా సంఘాలు, పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, విద్యార్థులు సంఘటితంగా కదిలి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంలో భాగస్వాములై గ్రామా పాలనలో గుణాత్మక మార్పునకు కృషిచేయాలి. తెలంగాణ పల్లెలు ఆదర్శ గ్రామాలుగా విలసిల్లాలని చేస్తున్న కృషి ఎనలేనిది. ఇందులో భాగంగానే చెత్త సేకరణ, మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఎప్పటికప్పు డు గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నది. కూలిపోయిన ఇండ్లు, పాడైపోయిన పశువుల కొట్టాలు, గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను ఎప్పటికప్పుడు తొలిగిస్తున్నది. పనికిరాని బావులను, బోరు బావుల ను పూడ్చేస్తున్నది.


గ్రామాల్లో యువతీయువకులు, విద్యార్థులు ప్రభుత్వ పథకాలన్నింటిపైనా అవగాహన పెంపొందించుకోవాలి. తద్వారా గ్రామాల్లోని నిరక్షరాస్యులకు, ప్రజలకు గ్రామసభల్లో పాల్గొనే విధంగా సంపూర్ణ అవగాహన కల్పించాలి. నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించేందుకు డిజిటల్ లిటరసీని పెంపొందించేందుకు కృషి జరుగాలి. గ్రామాల్లో చదువుకున్న వారు,ఉద్యోగులు బాధ్యత కలిగిన పౌరులుగా, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషిచేయాలి.


దోమల మందు పిచికారీ చేస్తూ ప్రజలను విషజ్వరాల నుంచి కాపాడుతున్నది. అక్కెరకు రాని మొక్కలను తొలిగిస్తున్నది. లోత ట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటిస్తున్నది. వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టడం, గ్రామాల్లోని చెత్త కోసం డంపింగ్ యార్డులు ఏర్పాటుచేయడం, గ్రామ కమ్యూనిటీ హాళ్లు, గోదాముల నిర్మాణం చేపట్టడం లాంటి అనేక బృహత్తర కార్యక్రమాలను చేపడుతున్నది. గ్రామాలకు కావాల్సిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తున్నది. గ్రామాల్లోని విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వీధి దీపాల కోసం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. శిథిలావస్థ కు చేరిన విద్యుత్ స్తంభాలను మరమ్మతులు చేయటమే కాదు, కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నది. ఇనుప స్తంభాలను తొలిగించి సిమెంట్ స్తం భాలను ఏర్పాటుచేస్తున్నది. తెలంగాణకు హరితహారంలో భాగంగా చేయాల్సిన పనుల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ నర్సరీలను ఏర్పాటుచేయడం, నరేగా నిధులను ఉపయోగించి మండల అటవీశాఖ అధికారి నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటున్నది. గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి అవి ఎదిగేవరకు ప్రజలను భాగస్వాములను చేస్తున్నది. ఇంటి యజమానులు, రైతులతో మాట్లాడి వారికి కావాల్సిన మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తున్నది. వేప, చింత, నిమ్మ, ఉసిరి, మునగ, జామ, మామిడి చెట్లను అధికంగా పెంచేందుకు ప్రోత్సహిస్తున్నది. గ్రామా ల్లో వందకు వందశాతం పన్నులు వసూలు చేసి, గ్రామ సచివాలయాలను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. దీంతో గ్రామాలకు సంబంధించిన చిన్న చిన్న అవసరాలు వెంటనే తీరే పరిస్థితి వస్తుంది. వారాంతపు సంతల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. జనన, మరణ, వివాహ రిజిస్ట్రేషన్లను వెంటనే నమోదుచేసి వెంటనే ధృవపత్రాలను అందజేస్తున్నది. విద్యుత్ సంస్థకు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించటం, గ్రామ పరిధిలోని పరిశ్రమలు, కంపెనీలతో సంప్రదించి సాం ఘిక బాధ్యతగా కమ్యూనిటీ, సోషల్ రెస్పాన్స్‌బిలిటీ నిధులు కేటాయించేలా కృషిచేస్తున్నది. ఆ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించటం, గ్రామ ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నది.
Anabheri-Rajeshwar-rao
ఇంతేకాకుండా గ్రామస్థులను, యువకులను శ్రమదానానికి ప్రోత్సహించి సామాజిక పను లు చేపట్టాలి. తద్వారా మన గ్రామాలు ఆదర్శగ్రామాలుగా రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గ్రామాల్లో యువతీయువకులు, విద్యార్థులు ప్రభుత్వ పథకాలన్నింటిపైనా అవగాహన పెంపొందించుకోవాలి. తద్వారా గ్రామాల్లోని నిరక్షరాస్యులకు, ప్రజలకు గ్రామ సభల్లో పాల్గొనే విధంగా సంపూర్ణ అవగాహన కల్పించాలి. నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించేందుకు డిజిటల్ లిటరసీని పెంపొందించేందుకు కృషి జరుగాలి. గ్రామాల్లో చదువుకున్న వారు,ఉద్యోగులు బాధ్యత కలిగిన పౌరులుగా, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషిచేయాలి. వియోజన విద్యా కార్యక్రమం సైతం అమలయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. తద్వారా మన తెలంగాణ పల్లెల్ని అక్షరాస్యత గల గ్రామా లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం సూచించిన ముప్ఫైరోజుల కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలుపరిచిన ప్రజలు, ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్రం దేశ సమగ్రాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించేలా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. రాష్ట్ర పౌరులు, విద్యావంతులు, స్వచ్ఛంద సేవాసంస్థల, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎన్.ఎస్.ఎస్., ఎన్‌సీసీ, స్కౌట్స్ జగైడ్స్, యువజన సంఘాలు, వయోజన విద్య, గ్రంథాలయ శాఖ ఉద్యోగులు, గ్రామ పరిపాలనలో భాగస్వాములయ్యే అధికారులందరూ ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా సమన్వయంతో స్వచ్ఛందంగా పాల్గొనాలి. మన పల్లెల్ని, మన గ్రామాలను మనమే తీర్చిదిద్దుకోవాలి. ఇందుకోసం మనమే చైతన్యపరుచుకోవాలి. గ్రామ వికాసానికి మనమంతా అంకితభావంతో సంఘటితమై పనిచేసినప్పుడే గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరా జ్యం ఆవిష్కారమవుతుంది. స్వచ్ఛత, పచ్చదనం, మౌలిక వనరులు, వసతులతో గ్రామ సమగ్రాభివృద్ధి సాధించాలి. ఇదే సీఎం కేసీఆర్ తల పెట్టిన ముప్ఫై రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళిక, కార్యాచరణకు అర్థం, పర మార్థం.

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles