మాటలతో మాంద్యం పోదు


Sun,September 15, 2019 12:51 AM

ప్రపంచవ్యాప్తంగా మిత వాదపార్టీలు తీవ్రవాద లేదా మతవాద నాయకత్వం చేతుల్లోకి వెళ్లిపోయాయి. మితవాదపార్టీల మౌలిక సూత్రాలైన నైతికత, నిబద్ధత, విలువలు కనుమరుగైపోయాయి. ఎన్నికల ప్రయోజనం కోసం జాతుల, వర్గా ల, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి తప్పుడు విధానాలతో ప్రపంచ ఆర్థికవ్యవస్థను సంక్షోభం లోకి నెడుతున్నారు. ఈ తీవ్రవాదప్రభుత్వాల మధ్య సారూప్యతలు ఉన్నాయి. మైనారిటీ ప్రజలలో అభద్రతాభావం కల్పించడం, మెజారిటీ ప్రజలలో మత మౌఢ్యాన్ని ప్రోత్సహించడం, బడా పెట్టుబడిదారుల అవసరాల కోసం జాతీయ వనరుల ను, చిన్నతరహా పరిశ్రమలను, రైతులను, సామాన్య ప్రజానీకాన్ని బలిచేయడం గమనించాల్సిన విషయం. ప్రసారసాధనాలపై, అవినీతి సంపదపై, అక్రమ ఆస్తుల పై, నేర రాజకీయాలపై గుత్తాధిపత్యం చెలాయించడమే కాక న్యాయవ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే విధానాలను అమలుపరుస్తున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ బ్రెగ్జిట్ విషయంలో దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. దీని వల్ల 21మంది అధికారపార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు తిరుగుబాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీని నిర్వీర్యం చేశాడు. సీనియర్లును పక్కకునెట్టేశాడు. క్యాబినెట్ సెక్రటరీలను ఇష్టానుసారం మారుస్తూ పాలనను కుంటు పట్టించా డు. తప్పుడు ఆర్థిక విధానాలతో స్టాక్ మార్కెట్‌ను నష్ట పరిచాడు.దేశ అప్పును పెంచాడు. ఆర్థిక సంక్షోభం సృష్టించాడు. భారతదేశంలో మోదీ ప్రపంచ నాయకులను తలదన్నే పద్ధతులను అవలంబిస్తున్నాడు. 2014లో ఉచ్ఛ దశలో ఉన్న ఆర్థికపరిస్థితిని డిమానిటైజేషన్, జీఎస్టీ టాక్స్ విధానాలు ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను నష్ట పరిచాడు. 86 శాతం చలామణిలో ఉన్న 500, 1000 నోట్లు అర్ధరాత్రి రద్దు చేశారు. దీనివల్ల దేశంలో అసంఘటిత రంగం, రవాణా, నిర్మాణ, చిన్నతరహా పరిశ్రమలు నష్టపోయి ఆర్థిక కార్యకలాపాలు కొంతకాలం నిలిచిపోయాయి.


ప్రభుత్వం సృష్టించిన స్వయంకృత ఆర్థిక మాంద్యం భారతదేశాన్ని ఆవరించింది. దాని ప్రభావం అన్నిరంగాలపై ఉంటుంది. ముఖ్యంగా సంక్షేమం, విద్య, ఆరోగ్యరంగాలు ఎక్కువగా నష్టపోతాయి. రాష్ర్టాల బడ్జెట్లు కుంచించుకుపోతాయి. అభివృద్ధి కార్యక్రమాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోతాయి. బ్యాంకుల ఏకీకరణ వలన సామాన్య ప్రజలకు మేలు జరుగదు.


దేశ ఆదాయ వనరులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడానికి జీఎస్టీ అమలుపరుచడం జరిగింది. జీఎస్టీ వలన ప్రభుత్వ ఆదాయం పెరిగి అనేక సంక్షేమ కార్యకలాపాలు అమలు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కానీ రానురాను జీఎస్టీ ఆదాయం తగ్గడం జరుగుతున్నది. జీఎస్టీ వలన 2018 ఏప్రిల్ నెల లో 1,03,459 కోట్ల ఆదాయం రాగా 2019 ఆగస్టు నెలలో 98,202 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. మౌలికమైన ఆర్థకరంగం బలహీనపడినప్పుడు వస్తు ఉత్పత్తి క్షీణించి, ఆదాయం తగ్గి పన్నుల వసూలు కావు. ప్రజలు డబ్బులు సంపాదిస్తున్నారు, దాచుకుంటున్నా రు పన్నులు కట్టడం లేదు అనే బూజుపట్టిన అభిప్రా యం నుంచి పుట్టిన తప్పుడు విధానాలే డిమానిటైజేష న్, జీఎస్టీ. ప్రపంచ ఆర్థికమాం ద్యాన్ని తట్టుకుని నిలిచిన భారత ఆర్థికవ్యవస్థ ఆత్మాహుతి దాడికి గురైన భవనం కూలిపోయింది. అందుకే అమెరికాలో 2008లో ఆర్థిక మాంద్యం వచ్చి ఆర్థికవృద్ధి 0.3 శాతానికి పడిపోతే భారతదేశంలో ఆర్థికవృద్ధి 9 శాతం ఉన్నది. భారత ఆర్థికవ్యవస్థ పతనానికి 22 నుంచి 37 సంవత్సరాల వయ స్సున్న యువకులు కార్లు కొనకపో వడం కారణమని ఆర్థికమంత్రి నిర్మ లా సీతారామన్ ప్రకటించారు. రూపాయి విలువ పడిపోవడానికి క్రెడిట్‌కార్డ్‌ను ఎక్కువగా ఉపయోగించకపోవడంపోవడమే అని ఇంకొక నాయకుడు చెప్పారు. ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఇంతటిఘనమైన సిద్ధాంతాలను కనుగొనలేకపోయారు. నిరుద్యోగంతో బాధపడుతున్న యువకులు కార్లు కొనలేక ఉబర్ సర్వీసులను ఉపయోగిస్తుంటే ఉద్యోగాలను కల్పించాల్సిన ప్రభు త్వం యువకులను దోషులుగా చిత్రీకరిస్తున్నది. ఈ మధ్యన మోదీ భారత ఆర్థికవ్యవస్థను ఐదు సంవత్సరాలలో రెండంతలు అంటే ఐదు ట్రిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటిస్తున్నాడు. కానీ ఇది సాధ్యం కాదని అర్థశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఏకకంఠంతో చెబుతున్నారు. బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి ప్రకారం ప్రస్తుత ఆర్థికవృద్ధి ఐదు శాతం కాదు మూడున్నర శాతం మాత్రమే.
m-nagendhar
ఐదు సంవత్సరాలలో ఐదు ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక అభివృద్ధి జరుగాలంటే వరసగా సంవత్సరానికి వృద్ధిరేటు 14 1/2 శాతం జరగాలి. కానీ ఆ సూచనలు ఏమాత్రం లేదు కనిపించడం లేదు. మోదీ ప్రగల్భాలు అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను తగ్గిస్తున్నాయి. వచ్చే ఐదు సంవత్సరాలు 25 శాతం అభివృద్ధి పన్నుల వసూళ్లలో కనిపిస్తుందని ప్రభుత్వం ప్రకటిస్తే జనవరి నుంచి ఆగ స్టు వరకు 4.69 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. 25 శాతం టార్గెట్ ను ఎలా చేరుకుంటారని ఐఎంఎఫ్ ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ప్రభుత్వం సృష్టించిన స్వయంకృత ఆర్థిక మాంద్యం భారతదేశాన్ని ఆవరించింది. దాని ప్రభావం అన్ని రం గాలపై ఉంటుంది. ముఖ్యంగా సంక్షేమం, విద్య, ఆరో గ్య రంగాలు ఎక్కువగా నష్టపోతాయి. రాష్ర్టాల బడ్జె ట్లు కుంచించుకుపోతాయి. అభివృద్ధి కార్యక్రమాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోతాయి. బ్యాంకుల ఏకీకరణ వల న సామాన్య ప్రజలకు మేలు జరుగదు. కానీ పెద్ద కంపెనీలకు మూలధనం అందుబాటులోకి వస్తుంది. బ్రిట న్, అమెరికా, భారతదేశ ప్రభుత్వాలు అనుసరిస్తు న్న విపరీత ధోరణుల వలన ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆయా దేశాలలో ప్రభుత్వాలు మారి సరైన విధానాలను అవలంబిస్తే తప్ప ఈ సంక్షో భం నుంచి ప్రపంచం బయటపడదు.

(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు, వాషింగ్టన్, డీసీ)

382
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles