బ్యాంకుల విలీనం ఎవరికి లాభం?

Thu,September 12, 2019 01:29 AM

నిధుల కొరత, మొండి బకాయిలు, నిర్వహణా లోపాల వం టి సమస్యలతో ప్రభుత్వరంగ బ్యాంకులు సతమతమవుతున్నాయి. ఒక దశలో ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న తరుణంలో ఆయా బ్యాంకుల విలీనానికి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. కానీ విలీన ఉద్దేశాలు, వాటి లక్ష్యాలు ప్రయోజనాలపై స్పష్టతలేదు. బ్యాం కుల విలీనంతో ప్రయోజనం బ్యాంకులకా, పరిశ్రమలకా, లేక సామాన్యుడికా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఏ దేశ అభివృద్ధి మూలాలైనా ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటాయి. దేశంలోని అన్నిరంగాల అభివృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ ఇంధనం లాంటిది. అందుకే, దేశంలో ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రుణ వితరణ సామర్థ్యం పెంచి ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ విలీనాల బాట పట్టినట్లుగా తెలుస్తున్నది. బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ బ్యాంకు ల సంఖ్య తగ్గుతుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులపై పర్యవేక్షణ, పనితీరు, మూలధన కల్పన వంటి అంశాలపై సులువుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే నిర్దేశిత లక్షాలను కూడా సులువుగా అమ లుచేయవచ్చు. ముఖ్యంగా దేశ ఆర్థికవ్యవస్థకు పారిశ్రామికీకరణ ముఖ్యమైనది. పరిశ్రమలకు ఎక్కువ మొత్తాల్లో రుణ సహాయం చేయడంలో పెద్ద బ్యాంకుల పాత్ర కీలకమైనది. విలీనం ద్వారా ఏర్పడే పెద్ద బ్యాంకులు దేశంలోని వివిధ పారిశ్రామిక వేత్తలకు కావలసిన రుణసాయం పెద్దమొత్తంలో చేయవచ్చు. అంతేకాదు, మూలధన సమీకరణకు కూడా పెద్దబ్యాంకులు అనుకూలం. కేంద్రంపై ఆధారపడకుండా పబ్లిక్ ఇష్యూ ద్వారా మూలధన సేకరణ చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య తగ్గి ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య పెరుగుదల కూడా గ్రామీణ భారతానికి శ్రేయస్కరం కాదు. విలీనాలతో బ్యాంకుల వితరణ సామర్థ్యం పెరిగి భారీ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు మెరుగుపడుతాయేమో కానీ, రైతులకు, చిరు వ్యాపారస్తులకు, చేతివృత్తుల వారికి అదనంగా చేకూరే ప్రయోజనం ఏమిటన్నది అస్పష్టం. అలాగే, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలకు కొత్తగా ఏ రూపేణా లబ్ధి చేకూరుతుందనేది కూడా ప్రశ్నార్థకమే. ముఖ్యంగా, బ్యాంకుల పరిమాణం ఏదైనా బ్యాంకుల పటిష్టత వాటి నిర్వహణా సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. చిన్నచిన్న బ్యాంకుల నష్టాల ప్రభావం కంటే, పెద్ద బ్యాంకుల నష్టాలు ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.


పెద్ద బ్యాంకులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలుంటాయి. పెద్దబ్యాంకులకు నిర్వహణా వ్యయం తగ్గడంతో పాటు, అంతర్గత, బహిర్గత ఆధారాలు అందుకునే అవకాశం ఉంటుంది. వైవిధ్యం ద్వారా పనితీరును మెరుగుపరుచుకోవ చ్చు. ముఖ్యంగా, నిరర్ధక ఆస్తులను, మొండి బకాయిలను తట్టుకొనే శక్తి పెద్ద బ్యాంకులకు మాత్రమే ఉంటుంది. ఇలాంటి ప్రయోజనాలను ఆశిం చే కేంద్రం బ్యాంకుల విలీనంపై దృష్టిపెట్టింది. కేవలం బ్యాంకుల విలీనమే కాకుండా, బ్యాంకుల నిర్వహణపై కూడా కొన్ని సంస్కరణలు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే బ్యాంకుల బోర్డులకు మరిన్ని అధికారాలు నిర్దేశించింది. బ్యాంకుల బోర్డులో పదవీ విరమణ లేదా వైదొలిగినవారి స్థానం భర్తీ చేయడంలో, ఫీజు నిర్ణయంలో బోర్డుకు అధికారాలు పెంచారు. పెద్ద బ్యాంకుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సంఖ్యను నాలుగుకు పెంచారు. దీనిద్వారా బ్యాంకుల కార్యకలాపాలపై, సాంకేతికతపై మరింత దృష్టి పెరుగుతుంది. తొలిసారిగా, చీఫ్ రిస్క్ ఆఫీసర్‌ను నియమించుకునే వెసులుబాటు కల్పించారు. ఇలా నిర్వహణా వ్యవస్థను పటిష్టపరిచే చర్యలు కూడా బ్యాంకింగ్ సంస్కరణలలో భాగంగా చేపట్టిం ది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకుల విలీనంతో బయటకి కనిపించే ప్రయోజనాలతో పాటు కని పించని నష్టాలు కూడా ఉన్నాయి. నిశితంగా పరిశీలిస్తే, ప్రస్తుత బ్యాంకుల విలీన ఉద్దేశం ఏమిటన్నదానిపై పూర్తి స్పష్టత లేదు. బ్యాంకులను లాభాల్లోకి తేవడం కోసమా? లేక దేశంలో పెట్టబడుల అవసరాలు తీర్చడం కోసమా? నిజానికి 18 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 14 బ్యాంకులు లాభా ల్లో ఉన్నాయని స్వయంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించా రు. అంతేకాదు, 2018, డిసెంబర్ నాటికీ నిరర్ధక ఆస్తుల విలువ ప్రభుత్వ రంగ బ్యాంకులో 8.65 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం 7.9 లక్షల కోట్లకు వాటి విలువ తగ్గింది. రుణ రికవరీ సైతం 1.21 లక్షల కోట్లకు చేరుకున్న ది. అలాంటప్పుడు, బ్యాంకుల విలీనంపై నిర్ణయం దేనికి అనే వాదన వినిపిస్తుంది.
rama-krishna
అంతేకాక, బ్యాంకుల విలీన ప్రక్రియలో శాస్త్రీయత ఏమిటన్న దానిపై స్పష్టతలేదు. ప్రస్తుతం విలీనమవుతున్న బ్యాంకుల్లో కొన్ని బ్యాం కులు నష్టాల్లో ఉన్నాయి. విలీనం తర్వాత ఆ నష్టభారాన్ని విలీన బ్యాంకు మోయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇండియన్ బ్యాంకు నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 3.75 శాతం కాగా దానిలో విలీనమవుతున్న అలహాబాద్ బ్యాంకు నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 5.22 శాతం. అంటే విలీనం తర్వా త అలహాబాద్ బ్యాంకు నికర నిరర్ధక ఆస్తులను ఇండియన్ బ్యాంకు మోయాల్సి వస్తుంది. అదేవిధంగా, బ్యాంకుల విలీన ప్రక్రియలో సిబ్బంది, పని సం స్కృతి, అనుసంధానం వంటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ అవి స్వల్పకాలికమే. కానీ, వినియోగదారులు, బ్యాంకుల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నది. ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య తగ్గి ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య పెరుగుదల కూడా గ్రామీణ భారతానికి శ్రేయస్కరం కాదు. విలీనాలతో బ్యాంకుల వితరణ సామర్థ్యం పెరిగి భారీ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు మెరుగుపడుతాయేమో కానీ, రైతులకు, చిరు వ్యాపారస్తులకు, చేతివృత్తుల వారి కి అదనంగా చేకూరే ప్రయోజనం ఏమిటన్నది అస్పష్టం. అలాగే, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు కొత్తగా ఏ రూపేణా లబ్ధి చేకూరుతుందనేది కూడా ప్రశ్నార్థకమే. ముఖ్యంగా, బ్యాంకుల పరిమాణం ఏదైనా బ్యాంకుల పటిష్టత వాటి నిర్వహణా సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. చిన్నచిన్న బ్యాంకుల నష్టాల ప్రభావం కంటే, పెద్ద బ్యాంకుల నష్టాలు ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే బ్యాంకుల విలీనం కంటే బ్యాంకుల నిర్వహణపై కేంద్రప్రభుత్వం నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. ముఖ్యం గా, బ్యాంకులు భారీ స్థాయిలో రుణవితరణ చేసేటప్పుడు తగిన మార్గదర్శకాల రూపకల్పన, రిజర్వు బ్యాంకు అజమాయిషీ పెరుగాలే. అప్పుడే ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి సార్థకత చేకూరుతుంది.

(వ్యాసకర్త: పోస్ట్ డాక్టోరల్ ఫెలో-కామర్స్ విభాగం, ఓయూ)

312
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles