మొహర్రం


Tue,September 10, 2019 12:43 AM

muharram-festive
మొహర్రమంటే
పీరీలు, నిప్పుల గుండాలు
మొహర్రమంటే
ఆహురా కర్బలా యుద్ధ జ్ఞాపకం
మొహర్రమంటే
షహీద్ శోకప్రకటన నెల
మొహర్రమంటే
ముస్లిం కేలండర్ మొదటి నెల
మొహర్రం పండుగే
పీర్ల పండుగ!
పంజా కపిటార విగ్రహాలు
ముజావిరు ఇంటినుంచి ఊరేగింపులు
ముస్లిం సోదరుల పులి వేషాలు
డప్పుల దరువులు
ముహమ్మద్ మనుమళ్ళ
వీరోచిత పోరాట ఆనవాళ్లు!!
ఈనెల దినాలు
హసన్, హుస్సేన్లవే
పీరీలంటే జండాలే
ఊదు వేయందే పీరు లేవదు!!
నాటి సాయుధ పోరాటన్నీ
నేటి తెలంగాణ ఉద్యమన్నీ
నడిపించిన శక్తి ధూలా కళారూపానిదే!!


- డాక్టర్ గుంటి గోపి, 80198 08207
(నేడు పీర్ల పండుగ సందర్భంగా...)

203
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles